అక్షరమే బలమైన ఆయుధం

అక్షరాల వెలుగులో
స్వచ్ఛమైన తెలుగులో
మనం మాట్లాడుకుందాం
సొగసులీను భాషలో

చదువులమ్మ నీడలో
ఉల్లాసపు ఓడలో
మనమంతా నివసిద్దాం
విజ్ఞానపు మేడలో

విలువలున్న బ్రతుకుతో
నిలకడ గల మాటతో
స్ఫూర్తినే పంచేద్దాం
ప్రేమలొలుకు మనసుతో

సాగరమంత ఓర్పుతో
గగనమంత నేర్పుతో
విశ్వశాంతి సాధిద్దాం
అసలు సిసలు మార్పుతో

ఘన తెలుగు తోటలో
వర్ణమాల కోటలో
ఇల రూపుదిద్దు కుందాం
భవిత నిర్మించుకుందాం

అక్షరమే ఆయుధము
విలువైన ఆభరణము
ఆశ్రయిస్తే మాత్రము
ఎక్కించును అందలము
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *