ఈ తరం అమ్మాయిల ఆలోచనలు ఎలా ఉంటున్నాయంటే? మగవారి తో సమానం అని మాకేం
తక్కువని? ఆలోచిస్తున్నారు..
నిజమే!
మగవారికన్నా ఎందులోనూ తీసి పోవడం లేదు సంపాదించు కుంటున్నారు అన్ని రంగాల్లో ఆరి తేరారు
తల్లి తండ్రులు ఒకరు ఇద్దరినే కనడంతో వారి గారాబం
కొంతవరకు బాగానే ఉన్నా జీవితాలు పాడు చేసు కోవడం లో మాత్రం తప్పనిపిస్తుంది..
మేమూ సంపాదిస్తున్నాం! మా తల్లి తండ్రులను మేమే చూసుకోవాలి అనే భావన కూడా ఉంటుంది అది కూడా నిజమే! తల్లి తండ్రులను చూసుకోవం లో తప్పు లేదు కానీ అందుకోసం మెుగుడు పిల్లలను వదిలేసి
అత్తగారింటిని వదులు కోవడం మూర్ఖత్వమే అవుతుంది..
వెనుకటికి ఆడపిల్లలకు ఏమీ తెలియక ముందే పెళ్లిల్లు చేసేవారు అందుకే ఏ తేడా లేకుండా అత్తగారింట్లో
అణుకువగా ఉండేవారు..
ఈ కాలంలో అలా కాదు చాలా కుటుంబాల్లో కలతలే!
ఓపికలెవరికీ ఉండడం లేదు అందుకే ఇవన్నీ!
అందుకే వెనుకటి కాలమే బెటరు..
ఇది నా స్వంతమే!