రమా ప్రభా ప్లీజ్ రమా ప్రభా! నిన్ను ఇంకో సారి ఏమనను లేవే!
నువ్వు చేసిన బంగాళ భౌ భౌ తింటానే
ఈ రోజుకు నన్ను వదిలేయవే! తింటాలేవే! అన్నాడు రాజబాబు..
రెండు చేతులు అడ్డం పెట్టుకుని తల అడ్డంగా ఊపింది
ప్రభ..
ఈ మాత్రానికే ఇంతగా అలగాలా? తిననన్నాననే గా
నీ కంత కోపం?
రాజబాబు బ్రతిమాలుతూనే ఉన్నాడు
అయినా చలనం లేదు రమాప్రభలో!
మరే నీ వంటలకు పక్కింటి పద్మనాభం కూడా ఆశ పడుతున్నాడే!
మనమెా పని చేద్దాం! ప్రభ గారి వంటిల్ల ని హోమ్ ఫుడ్
పెడదామె భలే ఆర్డర్స్ వస్తాయి చూడు.
అప్పటి వరకు అలిగి కూచున్న రమాప్రభ హుషారుగా
లేచి ఉత్సాహంగా అడిగింది..
నిజంగానా? అంటూ..
హా…మరేమనుకున్నావ్? పద్మనాభం ఎదురు చూస్తున్నాడు వాల్లావిడ ఊరెల్లింది కదా!
హమ్మయ్య అతను తింటాడో! తినడో ! కానీ దీని అలకైతే తీరింది అనుకున్నాడు రాజబాబు..
అదేదో అనుకుంటే ఇంకేదో అయింది..
రాజబాబు ఇలా ప్రచారం చేసాడో లేదో అలా ఆర్డర్లు వచ్చి రమాప్రభ వంటిల్లు ఫేమస్ అయింది..
అసలే భౌ భౌ తినలేని రాజబాబు కి అదెలా ఫేమస్
అయిందో అర్థం కాక తల పట్టుకు కూచున్నాడు..
మీకూ కావాలా? రమాప్రభ వంటింట్లో వంటలు?
అయితే ఆర్డర్ చేయండి…
ఇది నా స్వంత రచన.