అక్షరాలకై జీవించు

అక్షరాలకై జీవించు

జీవితంలో మృత్యువు వెంటాడి తరుముకొస్తున్నా నేను నేనుగానే సాగిపోయే బాటసారిని సూత్రధారిని,,,,,,,,,
జీవన్మరణ పరిస్థితులు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా నేను నేనుగా జీవించే అపరబ్రహ్మని,,,,,,,,
మనోవేధనలు చుట్టుముట్టితే నేను నేనుగా రాతి శిల్పానికి ప్రాణం పోసినట్లు గుండెల నిండా ఊపిరిలూదుకుంటూ సాగిపోయే జైత్రయాత్ర నాది,,,,,,,
లోకం నన్ను అవమానించి హేళనచేస్తున్నా సహిస్తూనే నేను నేనుగా సాహితీ సృజన చేస్తూ అజ్ఞాత జ్ఞానులను నా పంథాలో పయనింపజేస్తాను,,,,,,,,,,,
హృదయం చవిచూసే నవోదయ సౌందర్యంలా జీవితంలో ఆనంద ఘడియలు ప్రవేశించేలా జాగృత పడుతూ మహోజ్వల జీవనయాత్ర సాగిస్తాను,,,,,,,
మిడిమిడి జ్ఞానులకు నవజీవన సౌందర్యం రుచిచూపించి వాళ్ళ జీవితాలను సౌశీల్యం చేసి అక్షర యజ్ఞం చేయిస్తాను భావుకున్నై,,,,,,,,
చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడే జనజీవితాల గుండెల్లో ధైర్యం పోసేందుకు అక్షర స్వరం పూరిస్తూ నా ఉవ్వెత్తున ఎగసిపడే అక్షరాలలో బహుదూరపు బాటసారులవుతారు,,,,,,,,,
ఈ దుఃఖభూయిష్ట నిరుపేద బ్రతుకు ఇక చాలు చావే శరణ్యం అని ఉరికి సిద్ధమైన వానికి నా అక్షరాలు సులువుగా సున్నితంగా ఆత్మజ్ఞానం ప్రభోధించి ఆశాజ్యోతి వెలిగించి తనకుతానే తన జీవితంలో తిమిరాలను పారద్రోలే కావ్యాలు లిఖించే కళారూపసున్ని చేస్తాను,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *