బ్రతుకు పుటలలోని
దుఃఖిత లోగిళ్ళను
లిఖించుకున్న అక్షరాలను
ఎన్నిమార్లు మళ్ళీమళ్ళీ చదువుకున్నానో
కన్నీళ్ళను కళ్ళ బావిలోంచి
తోడుకుని నాలోనేను కుమిలి కుమిలి
లౌక్యం తెలియని అమాయకత్వంలో
ఎన్నెన్ని మార్లు మోసపోయానో
ఎన్నిమార్లు చావు తలంపులతో
పిశాచి కలల్లో తేలియాడానో
బాల్యం నుండి మనో సంఘర్షణలలో
ఎడారి మంటల ఇసుకలో
జీవితం ఎండమావుల్లో పరుగులు
ఎక్కడా ఆసరాగా ఒయాసిస్సు అగుపించలేదు
ఓటముల మీద ఓటములతో
జీవితమంతా గుండె మంటలే
స్నేహితులే నా ప్రతిభకు సవాళ్ళైనారు
నేను అనేవాన్ని చిరునామా లేకుండా
నా ప్రగతి పడగొట్టి పైనుండి అందలాలెక్కారు
అగమ్యగోచరంగా ప్రయాణం సాగించాను
మనస్సు నిండా అగ్గిపుష్పించి
తిమిరాల నుండి సన్నని కాంతి కిరణాలు
ఎక్కడినుండో చిన్నిచిన్ని ఆశలు
జీవితంలో చిగుళ్ళు తొడిగాయి
చిన్న బడిపంతులు ఉద్యోగం
అక్షరాలు రాసుకునేందుకు కలం
అగుపించిన కాగితాల నిండా సిరా
అక్షరాల తొలిపొద్దు ఆరాధ్యం
దైవ కృపవల్ల మీ ముందుకు
అనుంగు సోదరుడు అక్షరాలలో
నా జీవుతానుభవాలే నా కవితలు
నాకు కళ్ళల్లోని అక్షరాలు ఆ దైవం,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట