అక్షర కొరకుఅంశం :⁠- చిత్ర కవితతేది:⁠- 30/09/2025శీర్షిక :⁠- ఆకు చేతబడి

                                      దసరా సెలవులు కాబట్టి  పిల్లలు ఆనందంగా ఆడుకుంటున్నారు. ఆ ఊర్లో వెంకటప్పయ్య అని ఒక వెంగళప్ప ఉన్నాడు.

పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్లతో పాటు ఆడుకుంటానని వాళ్ళ ఆటలు ఏదో ఒకటి తీసుకుని వెళ్లిపోయేవాడు.
అయితే ఒకరోజు తన స్నేహితుడు వచ్చాడని కలవడానికి వెళ్తాడు వెంకటప్పయ్య.
పిల్లలు చిన్న చిన్న కర్ర పుల్లలు ఆకులతో పువ్వులతో ఆడుకుంటూ ఉన్నారు.
అది చూసి బలవంతంగా వాళ్ళ చేతిలో నుంచి తీసుకొని వెళ్ళిపోయాడు. అది చూసిన పిల్లలు కోపంతో రగిలిపోతూ బాగా ఆలోచించారు.
రెండు రోజుల తర్వాత అదే దారి వెంట వెళ్తూ ఉంటే ఒక పెద్ద ఆకుపై చిన్న చిన్న పూలతో ఒక బొమ్మ ఆకారం చేశారు.
ఆకుపైన చిందర వందరంగా కట్టి పుల్లలు పెట్టారు.
అది వెంకటప్పయ్య చూసేలా చేశాడు.
“ఎవరో మనల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నారు రా? అందుకే మనం ఎప్పుడూ ఆటలు ఆడుకోకూడదు?” అని ఒక పిల్లాడు అంటే…
ఆ మాట విన్న వెంకటప్పయ్య భయపడిపోయి ,
“అమ్మో! పిల్లల దగ్గర బొమ్మలు తీసుకున్నాను , నాకేమైనా అవుతుందేమో?” అని భయపడిపోయాడు.
ఆ మాటలు విన్న ఇద్దరి పిల్లలు మనసులోనే నవ్వుకున్నారు.
పదేపదే ఆకు కట్టెపుల్లలు వైపు చూస్తూ వెళ్లిపోతూ ఉన్నాడు వెంకటప్పయ్య.
కొంత దూరం వెళ్లిపోయిన తర్వాత పిల్లలు పగలబడి నవ్వుకున్నారు ఇంకెప్పుడూ వాళ్ళ ఆడుకున్న చోటికి వెంకటప్పయ్య రాడు అని ఆనందపడ్డారు.
పాపం వెంకటప్పయ్య అది నిజమానుకొని తన దగ్గర ఉన్న ఆట బొమ్మలన్నీ పిల్లలకి ఇచ్చేశాడు.
అప్పటినుండి పిల్లలు ఏడిపించడం కానీ పిల్లల దగ్గర ఆట వస్తువులకు తీసుకోవడం కానీ చేసేవాడు కాదు.
పిల్లలు అప్పుడప్పుడు ఇదే విషయం తలుచుకొని పగలబడి నవ్వుకునేవారు.
చేతబడి చేస్తే ముగ్గు వేస్తారు అదే పిల్లలు జోలికి రాకుండా చేయాలి అంటే ఆకు చేతబడి చెయ్యాలి అని అనుకున్నారు పిల్లలు.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ కథ నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *