"బావ! ఈ అమ్మాయి నాకు బాగా తెలిసిన అమ్మాయి , మన స్వీట్ షాప్ లో పెట్టుకుందాం బావ" అని మౌనిక అడుగుతుంది.
“సరేలే! మౌని ఎలాగో నీకు ఒక మనిషి కావాలి కదా? ఈ అమ్మాయి ఎలాగో తెలిసిన అమ్మాయి అంటున్నావు కదా పెట్టుకో?” అని అన్నాడు మురళి.
“సరే బావ..!” అని చెప్పి , వెన్నెలని తనతో పాటు స్వీట్ షాప్ కి తీసుకొని వెళ్ళింది మౌనిక.
మురళి , మౌనిక బావ మరదలు చిన్నప్పుడే ఒక యాక్సిడెంట్ లో ఇరువురు తల్లిదండ్రులు చనిపోయారు. మురళికి గురువు లాంటి బాబాయి వాళ్ళిద్దర్నీ చదివించి , మురళి బట్టలు చాలా బాగా కుడతాడు టైలరింగ్ షాప్ పెట్టించారు. మౌనికకి స్వీట్స్ అంటే మహా పిచ్చి తినడం కాకుండా చాలా బాగా చేస్తుంది తన చేత స్వీట్ షాప్ పెట్టించారు.
ఇలా ఇరువురికి చేరో షాప్ పెట్టించి వాళ్ళు జీవితంలో పైకి ఎదగాలని కోరుకున్నారు ఆ బాబాయ్.
ఆ బాబాయ్ తన కొడుకు తనకి తెలియకుండా ఆస్తి మొత్తం తమ పేరు మీద రాసుకున్నారు అని తెలిసి కొంచెం ఆందోళనతో హఠాత్తుగా గుండెపోటుతో చనిపోయారు. ఆయన ఆస్తితో వాళ్ళ పిల్లలు విదేశాల ప్రయాణం అయిపోయారు.
ఇంకా కొన్ని రోజులు తర్వాత పెళ్లి చేసుకోవాలని మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. మౌనిక , మురళి.
వాళ్ళిద్దరికీ అంటూ ఒక పెద్దదిక్కు అనేవారు ఇప్పుడు ఎవ్వరూ లేరు? ఉన్న ఆ బాబాయ్ కూడా నెల క్రితమే చనిపోయాడు.
“వెన్నెల నువ్వు ఇక నుంచి నేనున్నా లేకపోయినా షాప్ కు వచ్చి స్వీట్స్ తయారు చేస్తూ ఉండు , సరేనా! నీ జీతం సమయానికి ఇచ్చేస్తాను” అని చెప్పింది మౌనిక.
వెన్నెల తన మూగ సైగలతో థాంక్యూ అని చెప్పింది వెన్నెలకు పుట్టింది దగ్గర్నుంచి మాటలు రావు. ఆ తర్వాత వాళ్ళ అమ్మానాన్న చనిపోయారు ఉన్న ఒక అన్న పెళ్లి చేసుకోను తర్వాత వాళ్ళ వదినకి పెద్ద జబ్బు చేయడంతో చనిపోయింది.
వాళ్ళ అన్నంత కాలం అన్న ఉన్నంతకాలం వెన్నెలను తన అన్న కూతురును ఎంతో అపురూపంగా చూసుకునేవాడు కానీ పని చేసి ఇంటికి వస్తున్న సమయంలో ఒక లారీ యాక్సిడెంట్లో చనిపోయాడు.
ఆ తర్వాత వాళ్ళ అన్నయ్య చేసిన అప్పులను తీర్చడానికి కోసం ఎక్కడ పని అడిగినా కూడా నువ్వు అసలే మూగ దానివి నీకు ఉద్యోగం ఎవరిస్తారు అని ఎగతాళిగా మాట్లాడారు? ఆ మాటలు విని తట్టుకోలేకపోయింది కానీ తన మేనకోడల్ని చూసి అలా వెతకడం మొదలు పెడుతూ ఉండగా…
ఎవరో దొంగ మౌనిక మెడలో ఉన్న గొలుసును తీసుకోపోవడం గమనించిన వెన్నెల అతన్ని పట్టుకొని కొట్టడం చూసి తనని కాపాడినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంది ఆ కృతజ్ఞత భావంతోనే , వెన్నెలకు తన షాప్ లో ఉద్యోగం ఇచ్చింది.
అలా ఆరు నెలలు గడిచిపోయాయి ఎంతో ఆనందంగా స్వీట్ షాప్ లో స్వీట్స్ చేసుకుంటూ తన మేనకోడల్ని చదివించుకుంటూ కాలాన్ని గడిపేస్తుంది వెన్నెల.
ఎన్ని ముహూర్తాలు పెట్టిన ఎక్కడో దగ్గర ఆటంకం కలుగుతూనే ఉంది అని తమ కులదైవమైన సింహాద్రి అప్పన్న కొలువుతీరిన సింహాచలం వెళ్లాలని నిర్ణయించుకున్నాడు మురళి.
అదే విషయం మౌనికకి చెప్తే…
“అదేంటి! బావ సడన్గా చెప్తావు..?” అని అంది.
“అది కాదు మౌని! మన పెళ్లికి ఎన్ని ముహూర్తాలు చూసిన అస్సలు కుదరట్లేదు? అందుకే ఆయనకి మొక్కుకున్నా , ఆయన మొక్కు తీర్చుకున్న తర్వాత , మన పెళ్లికి ముహూర్తం కచ్చితంగా కుదురుతుంది అనిపిస్తుంది” అని అన్నాడు మురళి.
“మరి మన షాపుల సంగతి బావ” అని ఆలోచనతో అడిగింది మౌనిక.
“ఒసేయ్ పిచ్చిదానా! నీ షాప్ లో ఒక నమ్మకస్తురాలు , నా షాప్ లో ఒక నమ్మకస్తుడైన ధర్మ ఉన్నాడు కదా! చూసుకుంటారు లే కంగారు పడకు , రెండు రోజుల్లో సింహాచలం బయలుదేరుతున్నాం సిద్ధంగా ఉంటే చాలు” అని చెప్పి వెళ్ళాడు మురళి.
మురళి టైలర్ షాపు మొదట్లో పెట్టినప్పుడు ఆ షాప్ దగ్గర ధర్మ ఒక బిచ్చగాడు ప్రతిరోజు అతను రావడం చూసి రెండు రోజులు పట్టించుకోకుండా వదిలేశాడు మురళి.
తర్వాత తను రావడంతో ప్రతిరోజు భోజనం పెట్టేవాడు. అలా కొన్ని రోజులు తర్వాత తనకి నమ్మకమైన మనిషి కావాలి అని వెతుకుతూ ఉంటే…
మౌనికనే ఆ సలహా ఇచ్చింది ఆ బిచ్చగాడిని(ధర్మ) నీ సహాయకుడిగా ఎందుకు పెట్టుకోకూడదు అని? ఆ చెప్పగానే మురళి కూడా ఒప్పుకొని తనని చక్కగా తయారు చేసి తన షాప్ లో పనిలో పెట్టుకుని పని అంతా నేర్పించాడు మురళి.
అలా ఎంతో విశ్వాసంగా మురళి దగ్గర పని చేస్తున్నాడు ధర్మ.
రెండు రోజుల తర్వాత ఒకరోజు సాయంత్రం బస్సుకి సింహాచలం బయలుదేరారు మౌనిక , మురళి.
వారం రోజుల తర్వాత ,
వెన్నెల ఎప్పటిలాగా ఆ రోజు షాప్ కి వచ్చి ముఖ భావంగా స్వీట్స్ చేసుకుంటూ గతం తలుచుకుంటూ కన్నీళ్లు వచ్చి వస్తూ ఉంటే కనబడకుండా తుడుచుకుంటూ తన పని చేసుకుంటూ పోతుంది.
అప్పుడే అక్కడికి ప్రసాదం ఇవ్వడానికి వచ్చిన మౌనికని ఆత్మీయంగా పలకరించారు. ఇద్దరు ముఖ భావంగానే పలకరించింది వెన్నెల కూడా.
అందరికీ ప్రసాదం ఇచ్చి వెళ్లిపోయింది మౌనిక. గంట తర్వాత మురళి షాప్ దగ్గరికి వెళ్లి ధర్మానికి కూడా ప్రసాదం ఇచ్చి ,
మురళితో ఏదో మాట్లాడుతూ ఉంది.
ధర్మలో ఇంతకు ముందున్న అమాయకత్వం అస్సలు కనిపించడం లేదు ఎక్కడో ఏదో గర్వం ఏదో సాధించాను అన్నా అహంకారం అతనిలో కనిపిస్తూనే ఉంది అది గమనించిన మౌనిక ఆలోచనలో పడిపోయింది.
షాప్ లో పని అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్లి మేనకోడలికి అన్నం పెట్టి పడుకోబెట్టింది వెన్నెల.
ఆ చిన్న వెలుతురులో ఒక మూల కూర్చొని ఏడుస్తూ కూర్చోనుంది వెన్నెల. ఈ ఒక్కరోజేనే కాదు ఈ వారం రోజుల నుంచి ఇదే తంతు ప్రతిరోజు షాప్ నుంచి రావడం మేనకోడలికి ఏదో ఒకటి తినిపించేసి పడుకోబెట్టడం తను మాత్రం ఏమీ తినకుండా ఒక మూలన కూర్చొని గతం తలుచుకొని ఏడుస్తూనే ఉంది.
ఇదే సమయంలో మురళీ మౌనికల పెళ్ళికి ఒక మంచి ముహూర్తం కుదిరింది. మురళి మాత్రం ఆనందంలో విహరిస్తూ ఉన్నాడు. మురళికి మౌనికకు తెలిసిన వాళ్ళకి పెళ్లి పత్రికలు పంచడం మొదలుపెట్టారు.
ఆరోజు వెన్నెలకి జ్వరం అంటే షాప్ కి రాలేదు. పెళ్లి పత్రిక ఇవ్వడానికి తన ఇంటికి వెళితే…
రూమ్ లో కూర్చొని ఏడుపు వినిపిస్తుందే కానీ అది ఎవరు ఏడుస్తున్నారో అన్న మాత్రం తెలుసుకోలేక పోయింది మౌనిక?
మౌనిక తలుపు కొట్టగానే వణికిపోయింది.
‘అతనేనా! అతను అయితే ఎలా ఎదుర్కోవాలి? నేను చనిపోతాను?” అని ఫ్యాన్ కి తను చున్ని వేసుకొని చావడానికి సిద్ధమవుతూ ఉండగా… కిటికీ నుంచి మౌనిక చూసి ,
“వెన్నెల… వెన్నెల… ఏంటి పిచ్చి పని మీ అన్నయ్య కూతురు ఉంది అన్న సంగతి మర్చిపోతున్నావా?” అని గట్టిగా అరిచింది మౌనిక.
ఆ మాట విన్న వెన్నెల ఆ స్టూలు దిగి వెంటనే తలుపు తీసి మంచం మీద కూర్చొని ఏడుస్తూనే ఉంది.
“ఏమైంది! వెన్నెల ఏం జరిగింది? ఎందుకు కొన్ని రోజుల నుంచి దిగులుగా ఉన్నావు?” అని కొంచెం ఆందోళనగా అడిగింది మౌనిక.
మురళి అన్నయ్య షాపులో ఉన్న ధర్మ దగ్గరికి ఒక రోజు నా నా బట్టలు ఇవ్వడానికి వెళ్లాను. ఆరోజు జోరున వర్షం , అతను కొంచెం తాగేసి కూడా ఉన్నాడు. నేను తొందరగా బట్టలిచ్చి వెళ్ళిపోదాం అనే లోపు వర్షం ఇంకా ఎక్కువైంది. దాంతో అక్కడ మూడు గంటలు ఉండాల్సి వచ్చింది.
అతను పక్కకి వెళ్లి తాగుతూనే ఉన్నాడు. ఒక్క గంట తర్వాత నా పక్కన కూర్చొని ఎక్కడెక్కడో చేతులు వేయడం మొదలుపెట్టాడు ఆ తర్వాత నన్ను బలవంతంగా అనుభవించాడు అని కన్నీళ్లు పెట్టుకొని చెప్పింది.
“అయితే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు?” అని మౌనిక అడిగితే…
“మీ దగ్గర ఎన్నో సంవత్సరాల నుండి ధర్మ పని చేస్తున్నాడు కాబట్టి నేను చెప్తే నమ్మరు అని చెప్పాడు ధర్మ”అని చెప్పింది వెన్నెల.
మౌనిక మాత్రం కోపంతో రగిలిపోయింది.
“మీరు వచ్చే రెండు రోజులు ముందుగానే… నా ఇంటికి వచ్చి ఇక్కడే ఈ నాలుగు గోడల మధ్య ఇంకోసారి అనుభవించాడు” అని గట్టిగా ఏడుస్తూ కౌగిలించుకుంది వెన్నెల.
“సరే వెన్నెల అతని సంగతి నేను చూసుకుంటాను , ఇకనుంచి నువ్వు నార్మల్గానే ఉండు” అని చెప్పింది మౌనిక.
వారం రోజుల తర్వాత ధర్మ దొంగతనం చేశాడు అన్న ఆరోపణ రావడంతో పోలీసులు తనని తీసుకొని వెళ్ళిపోయారు.
మళ్లీ ధర్మ ఎప్పుడూ కనబడలేదు? మురళి పెట్టుకున్న గుడ్డి నమ్మకంతో చాలా బాధపడ్డాడు.
మౌనిక తన తెలివితేటలతో అతన్ని అతనిపైన దొంగ అనే ఒక ఆరోపణ మాత్రమే చేసింది కానీ అక్కడున్న వాళ్లకి తెలియనిది వెన్నెల జీవితం నాశనం చేశాడన్న సంగతి , మురళీ తో సహా ఎవ్వరికి తెలియదు ఈ విషయం?
కొన్ని రోజుల తర్వాత మురళికి మంచి స్నేహితుడైన సురేష్ విదేశాలనుంచి రావడం వెన్నెలను చూడగానే ప్రేమలో పడడంతో వారిరువురికి పెళ్లి చేశారు మౌనిక , మురళి.
మాధవి కాళ్ల..
హామీ పత్రం :-
ఈ కథ నా సొంతమని హామీ ఇస్తున్నాను..