అక్షర కొరకుఅంశం :⁠- మహిళల అభివృద్ధి ఎటువైపు?తేది:⁠- 11/10/2025

                              మహిళలు అభివృద్ధిలో దిశ వైపు అడుగులు వేస్తున్నప్పుడు ఎన్నో కొన్ని అడ్డంకులు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. కొందరు నువ్వేమి చేయగలవు అంటే...?

ఆడది వంట పనులు చూసుకుంటేనే మంచిది ఇలాంటి అభివృద్ధి వైపు మనకి ఎక్కువ స్థాయి ఉన్న సవాలను ఎదుర్కొంటుంది అన్న మాటలు వస్తూనే ఉంటుంది.
ఎంత అభివృద్ధి చెందాలి అనుకున్న ప్రతిసారి ఎవరో ఒకరు ఒక్క ఓటమి ఒక్క పని చెయ్యకపోయేసరికి అపనమ్మకంతో నువ్వు చేయలేవు వెనక్కి లాగడానికే చూస్తూ ఉన్నారు. కానీ ,
ఓటమి అనేది అనేకసార్లు వస్తుంది నువ్వు ప్రయత్నం అనేది చేయి అని అనడం లేదు.
అది కొందరి జీవితాల్లోనే అభివృద్ధి అనే పేరులోనే ఉన్న జీవితంలో ఉండడం లేదు.
మానసికంగా శారీరకంగా ఎంత చేసినా కూడా వాళ్ళకి కనిపించడం లేదు అని అనుకుంటూ ఏవేవో అంటూనే ఉంటున్నారు?
అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్నంత సేపు ఎక్కడ ఒక్క దగ్గర నిర్లక్ష్య భావంతో మాట్లాడే వాళ్లే ఎక్కువ కనిపిస్తూ ఉన్నారు.
అందులో ఎంతమంది నాటక రంగంలో ప్రవేశం తీసుకున్నారు తెలియదు కానీ , జీవితంలో మాత్రం నాటకాలు ఆడుతూనే ఉన్నారు.
ఒక రకమైన దుస్తులు ధరించడం చూసినవారు ఒక నిర్ణయానికి వచ్చేస్తున్నారు. ఆమె అలాంటిది అలాంటిది అసలు మంచిగా కాదు అని అంటారే కానీ తన అంతరంగంలో ఉన్న భావాన్ని ఎవ్వరూ అర్థం చేసుకోవట్లేదు?
అంటే మహిళలు మగవాడిలాగా పౌరుషంగా ఉండకూడదా? మాట్లాడకూడదు , అసలు ఎందుకు?
చదువులో ఆగ్రస్థానం సంపాదించిన కూడా కొన్నిటికి పరిమితం అయిపోయిన కూడా వాళ్లలో అభివృద్ధి చెందాలని తపనతో ఏదైనా మొదలు పెడితే చాలు…
కొన్ని కళ్ళు తట్టుకోలేక విషం చిమ్ముతాయి కూడా.. నిందలు అవమానాలు అనుమానాలు ఉంటున్న ప్రతి జీవితంలో పడుతూ ఉన్న ప్రతిక్షణం ఏదో తెలియని అంధకారంలో నిలిచిపోయి భయం అనే పాతాళా లోకంలో మునిగిపోతున్నారు.
ఏదో ఒక సందర్భంలో దాని గురించి భయపడుతూనే జీవితాన్ని గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతూనే ఉంది..
ఎంత అభివృద్ధి చెందాలని అనుకున్నా కానీ అక్కడ శూన్యం మాత్రమే కనిపిస్తూనే ఉంది.
అత్తారింట్లో ఒక ఇల్లాలికి మొదట మగ బిడ్డ కావాలని అడుగుతారే తప్ప ఆడపిల్ల అయినా పరవాలేదు అని అనడం లేదు.
కొన్నిచోట్ల లింగ విభేదాలను చూపిస్తూనే ఉన్నారు. సాంకేతిక ప్రపంచం మారుతున్న కూడా కొందరి మనసుల్లో కొన్ని అపోహాలు అలా నాటుకు పోతూనే ఉన్నాయి గంజాయి మొక్కలాగా.
కొందరు ఆర్థిక పరిస్థితి కోసం వాళ్లని కష్టపెట్టుకొని ఇతరుల కోసం బ్రతికితే కూడా చాలా చులకనగా చూస్తారు. చేసిన ప్రతి పనిని అవమానిస్తూ , అనుమానిస్తూనే ఉంటారు.
ప్రేమలు , ఆప్యాయతలు , బంధాలు వాటిలో ఉన్న బలం ఈనాటికి రోజుల్లో తక్కువ అయిపోతుంది. శూన్యంలో మహిళల అభివృద్ధి ఎటువైపు సాగుతుందో తెలియకుండానే పోతుంది?
కొన్నిసార్లు కన్నీళ్లు రెప్ప చాటున దాచుకున్న కూడా కనిపెట్టలేని మనుషుల మధ్య తిరుగుతూనే ఉన్నాం.

మాధవి కాళ్ల..
హామీ పత్రం :⁠-
                      ఈ వ్యాసం నా సొంతం అని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *