శీర్షిక – ప్రకృతి అందాలు
పచ్చదనంతో కూడిన అందాలు
పూల వనం లా మెరిసే చందాలు
చందమామ ను తలపించే జ్ఞాపకాలు
మది ఊసులలో నిదురించే తీపిదనాలు!
ఆకాశ గగనాన పిచ్చుకల్లా విహంగినై
విహరించాలని అధ్బుతమైన కోరికలు
కోరికలు గుర్రాలలా ప్రయాణిస్తుంటే
మనసు ఊహల్లో ఊగిస లాడుతుంది!
ఎంత హాయి బ్రతుకో పిచ్చుకలది
ఏ బాధలూ ఉండవు దొరికి నపుడే
తింటుంది నిద్ర వచ్చినపుడే పడుకుంటుంది
రేపటికి దాచుకోవాలని ఆశ లేదు!
అందమైన ఆకాశంలో ఆనందపు గంతులే
ప్రకృతి ఒడి లో సేద తీరే మనసులే
మనిషికి ఉన్న స్వార్థం కొంతైనా లేదా
జీవులకు ప్రకృతిలో మమేకమైన బ్రతుకులు!
చందమామను అందుకుంటున్నాయేమెా
ననిపించే ఆకాశం లో చూపులు
కిల కిలల రావాల తో చెట్టు పైన నివాసం
ఆకాశం వాటి స్వంతం వృక్షమూ వాటిదే!
ఈ అందాలన్నీ చూస్తూ మానవుల
మనసు ప్రశాంతంగా మారే అధృష్టం
ప్రకృతి మనకిచ్చింది కదా రోజూ
ప్రకృతిని తలుచుకుని థాంక్స్ చెప్పుకుందాం!
ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా!