అక్షర కొరకురచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – వృద్దాప్యం

వృద్దాప్యం భారం కాదు
అనుభవాల సారమైన గ్రంధం
ఆ వయసులో కూడా ఇతరులను
పోషించగల ధైర్యం
తనకు చాతకాక పోయినా కూడా
తన డబ్బులతో తన దగ్గరున్న
బంధువులను ఆదరించ గలరు
తన అనుభవాలను కథలుగా చెప్పి
జీవితాలను తీర్చిదిద్ద గలరు
పెద్దల మాట చద్దన్నం మూట కానీ
పెద్దల మాట ఎవరూ వినడం లేదిపుడు
వినకపోతే వారి కర్మ వింటే వారి జీవితాలు
పూలబాటలే!!

ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *