అక్షర దేవత

అక్షర కొరకు
అంశం :⁠- వసంత పంచమి
తేది:⁠- 23/01/2026
శీర్షిక:⁠- అక్షర దేవత

వసంతం వచ్చెను వేళలందు
పసుపు వెలుగుల పల్లకి ఎక్కి
ఆవాల పొలాలు నవ్వులొలికించి
కోకిల గానం కరిగెను గగనంలో
పంచమి పుణ్యదినం పలికెను మౌనంలో

జ్ఞానదేవి అడుగుల చప్పుడిలా
వీణానాదం వాయించెను హృదయంలో
అక్షరాలే మంత్రాలై వెలిగెను
పసుపు వస్త్రాల పరిమళంలో
సరస్వతి కరుణ కరిగెను భూమిపై

అజ్ఞానాంధకారమంతా చెదిరి
విద్య వెలుగులు విరియెను మనసులో
చిన్నారుల చేతిలో పలికెను మొదటి అక్షరం
తల్లిలా దీవించెను అమ్మ సరస్వతి
శ్రద్ధే దీపం, భక్తే నూనెగా

జ్ఞాన జ్యోతి నిలిచెను నిత్యంగా
వసంత పంచమి పండుగ కాదు
మనసుకు వచ్చిన కొత్త పుట
కోయిలమ్మ కుహూ కుహూ
స్వరము ప్రకృతి గీతము

తుమ్మెదలు చేసే ఝుంకారము
శారదమ్మకు అంకితము
వికసించిన తామరపై
ఆసీనురాలైన మహా శ్వేత
కరుణతో మన జీవితాలను

తీర్చిదిద్దే అక్షర దేవత
సరస్వతి కటాక్షముతో
పొందుదాము మనం కీర్తి శిఖరము
శారదా నీరద ప్రకాశితమైన
ఈ దినము అత్యంత పవిత్రము..

హామీ పత్రం :⁠-

                 ఈ కవిత నా సొంతమని హామీ ఇస్తున్నాను..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *