జన్మనిచ్చిన తల్లి నైనా
నడక నేర్పే తండ్రి నైనా
చదువు చెప్పే గురువు నైనా
సూర్యోదయానైనా
సుర్యాస్తమయానైనా
పండు వెన్నెల నైనా
కుహూ కుహూ పాడే కోయిలనైనా
పురివిప్పి నాట్యమాడే నెమళ్ళనైనా
అందమైన హరివిల్లు నైనా
అమ్మవు నీవే ఆలివి నీవే
అత్తవు నీవే అక్కవు నీవే
కూతురు నీవే కోడలివి నీవే
పిన్నివి నీవే పెద్దమ్మ వి నీవే
చెల్లివి నీవే వదిన వి నీవే
బంధాలు బంధుత్వాలు
పుట్టుకతో వచ్చేవి కొన్ని అయితే
ప్రయాణం లో కలిసేవి ఎన్నో .
హామీ పత్రం:- ఇది నా స్వీయ రచన