అక్షరలిపికి శుభములు అందుగాక
వార్షికోత్సవ శుభవేళ వందనములు
గాంధితాతకు,శాస్త్రికి వందనములు
సంతసించాలి సాహితీ సభ్యులంత
ఆరుగాలము సేవలందమరు గాక
విజయదశమితో మొదలిడి విజయమంద
తెగువజూపుము దుర్గమ్మ తెలుగు వెలుగ
ఆదుకొనుమమ్మ శారదా అండనుండి
మరల వచ్చెడి వార్షిక వత్సరముకు
సభ్యులందరు సౌభాగ్య శుభము లంది
సత్కవితలను వినిపించు శక్తి నిమ్ము!!
మరొక్క మారు మననము చేస్తూ…
............ కోట.