అక్షర లిపి కొరకునేటి అంశం – మహిళల అభివృద్ది ఎటువైపు?రచన – ఉమాదేవి ఎర్రం.

శీర్షిక – ఇంటి నుండి ఇంటర్నెట్ వరకు

మహిళలు అభివృద్ది పథం వైపు
మెల్ల మెల్ల గా అడుగులు వేసి
దేశ విదేశాల వైపు పరిగెడుతున్నారు
వివిధ రంగాలలో అడుగు పెట్టి అభివృద్దిని సాధిస్తున్నారు .
ఎటు చూసినా ఆడవాళ్ళ దే పై చేయి
అవుతుంది.
ఒకటి వచ్చు ఒకటి రాదనే తేడాయే లేదు
ఒకప్పటి వంటింటి కుందేళ్లు ఇప్పటి
ఇంటి నుండి ఇంటర్నెట్ వరకూ ఎదిగి
పోయిన వందేళ్లు జీవించే మహిళామణులు
భారత నారీ మణులు!
ఒకప్పుడు బయటకు వెళ్తేనే మాటలు పడి
నిందలు మెాసిన వారు కాదు ఈ తరం మహిళలు
ఎదురు నిలిచి ఎదుట పడి ఎదుర్కొనే ధీర వనితలు
అపర మహంకాళులు!!

ఇది నా స్వంత రచన.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *