అగ్నికీలల్లో నరమేథం
పర్వతం లోలోపల శిలలు కుతకుత లాడే అగ్నికి ఉడికి ద్రవించి దఢేల్మని పేలే అగ్నిపర్వతం అగ్నికూపం,,,,,,,,,
రంగు రంగుల అగ్నికీలల్లో లావా ఎగజిమ్ముతూ దిక్కులు పిక్కటిల్లే శబ్దంతో ఉగ్రనృసింహమై విరుచుకుపడుతూ,,,,,,,,,,
ఈ మానవుని టెక్నాలజీ, సైన్స్ ఏదీకూడా నిరోధించలేని,ఛేదించలేని జనజీవితాల గుండెల్లో గుబులు రేపుతూ మానవున్ని నిట్టనిలువునా కూల్చేసే లావా అగ్నిద్రవం విస్తరించినంత మేరా నామరూపాలు లేకుండా జనప్రాణ నష్టం వాటిల్లే క్షణాలు బహుగంభీరం,,,,,,,,,,
జనులు, జంతుజాలముల ఆర్తనాదాలలో మారణహోమం హృదయ విదారక కఠినమైన దృష్టాంతం,,,,,,,,,,,,
ఆ దావాణలంలో ఉక్కిరిబిక్కిరి చేస్తూ దట్టమైన అతివేడి పొగ గాలులు ,అగ్నిమంటలు విరజిమ్ముతూ మానవున్ని తుదముట్టించడమే లక్ష్యంగా కూలిపడుతున్న దట్టమైన అగ్గిపొగ మేఘాలు,,,,,,,,,,,
మనిషి తన జీవన పోరాటంలో శాస్త్ర ప్రయోగాలు చేసి ఎన్నెన్నో కనిపెట్టినా ప్రకృతి వైపరీత్యాలకు తలవంచక తప్పట్లేదు,,,,,,,,,,,,
ఈ జీవన్మరణ పరిస్థితుల్లో నైనా మన చుట్టూర వున్న చెట్టుచేమలను జంతుజాలములను రక్షించుకుందాం రక్షణపొందుదాం,,,,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట