అమృతం నింపుకున్న కలలు కనుకోలుకుల్లోంచి దృశ్యాలు దృశ్యాలుగా జాలువారుతూ,అక్షరాలలో లిఖించలేని తనివితీరని అనుభూతులు మనస్సు నిండా గజిబిజి అల్లికల మోడ్రన్ కళల్లా ఘాడమైన సాలోచనలను అర్ధం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ, రాయగలిగేంత వరకైనా అక్షరాలలో చిత్రీకరించే సంకల్పంలో, నా యవ్వనంలోని గుండెలు పగిలిన భగ్నప్రేమ చిత్రాలు మొత్తం కదిలివస్తుంటే ఈ వృద్దాప్యం వెక్కిరిస్తుంటే చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తూ రచనచేస్తే ,అసంపూర్తి విషాద కావ్యమైన రచన ,జవ్వని జడను వీడి మరుమల్లియలు రాలిపడుతున్నట్లు కలం నుండి రక్తసిక్త అక్షరాలు రాలిపడుతుంటే నన్ను నేను ఓదార్చుకుంటూ లిఖిస్తూ నీ ముందు నా బ్రతుకు చిత్రంలోని ఓ అంకం,,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట