అమ్మకు ప్రేమలేఖ

అక్షర కొరకు
అంశం – ప్రేమలేఖ పోటీ
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – అమ్మకు ప్రేమలేఖ

         నా ప్రాణమైన అమ్మకు నమస్కరించి ప్రేమతో

వ్రాస్తున్న లేఖ..
అమ్మా! అసలు నువ్వు లేకుండా నేనెలా ఉంటానో
అనుకున్నా!
కానీ నేనూ అమ్మనై పోయాను కదా! ఆ అమ్మ తనమే
నువ్వు లేకపోయినా బ్రతికేలా చేసిందమ్మా!
కానీ…ప్రతి విషయం లో నువ్వే ప్రతి క్షణమూ నువ్వే నా
మది లో!
ఏ చిన్న బాధ కలిగినా అమ్మా! అనుకోవడమే! ఏ సంతోషకరమైన వార్త విన్నా అమ్మా అని తలుచుకోవడమే!
అసలు అమ్మ లేకుండా ఇలా నేను బ్రతికి ఉండడమే
ఒక ఆశ్చర్యకరమైన విషయం..
అమ్మా! ఈ జన్మకు ఇలా కానిచ్చినా వచ్చే జన్మ లో నైనా నన్ను వదిలి పోవద్దమ్మా! మళ్లీ నువ్వే నా అమ్మ వై పది కాలాలు నాతో ఉండేలా ఆ భగవంతున్ని వేడుకుంటా!
మరి మరోజన్మకు మా అమ్మగా వస్తావు కదూ!

                                   నీ ముద్దుల గారాబాల                                                        కూతురు బుజ్జి...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *