అమ్మ లే (ఖ) క

అంశం : అక్షర పోటీ కొరకు

శీర్షిక : అమ్మ లే (ఖ) క

చిన్నా బాగున్నావా, అమ్మా ఎలా ఉన్నావ్ అని నువ్వు అడగాల్సింది కానీ నేను అడుగుతున్న చూడు ఇదే విచిత్రం రా నాకు మూడో సంతానం వద్దు అన్నారు కానీ నేను మాత్రం పట్టుపట్టి నిన్ను కష్టపడి కన్నానురా ఆ తర్వాత కష్టమైనా ఇష్టంగా పెంచుకున్నా రా ఆ తర్వాత మెల్లిగా చదువులో వెనకపడిన నాన్న తిట్టినా వెనకేసుకుని వచ్చిన ఎన్నోసార్లు నిన్ను కాపాడుకున్న కానీ ఉద్యోగం తర్వాత నాకు తెలియకుండా చేసిన అప్పులన్నీ నాకు తెలిసాక అవన్నీ దగ్గరుండి మరి ఒక్కో రూపాయి దాచినవన్ని తీసి అప్పులన్నీ తీర్చేసి ఎవరో వేదిస్తున్నారు అంటే భయపడకు బిడ్డ నేనున్నా అని ధైర్యం చెప్పిన, కరోనా లో దూరంగా ఉన్నప్పుడు కూడా నీకు జీతం వచ్చినా సరిపోవడం లేదంటే అప్పుడు పంపిన అక్కా, అన్న నీకు వాడంటేనే ఎక్కువగా ఇష్టం అని ఎన్నిసార్లు అన్నా అదేం లేదు అని కప్పి పుచ్చిన కానీ చిన్నా నువ్వంటే నాకు చాలా ఇష్టం రా అది నీకు తెలుసో లేదో కానీ నీకు నచ్చిన అమ్మాయి తోనే పెళ్ళి చేసాను అన్నీ ఖర్చులు పెట్టాను కానీ ఇన్నాళ్లు అందరం కలిసే ఉన్నామని సంతోషించే లోపే కావాలని గొడవ పెట్టుకుని నన్ను బయటకు పంపే వరకు నాపై నీకు ఇంత కోపం ఉందని నాకు తెలీదు రా అయినా నాదే తప్పు రా నిన్ను అందరికన్నా అతిగా ప్రేమించడం వలన కాబోలు నువ్వు నన్నెంత దూరంగా పెట్టాలని చూస్తున్నా నిన్ను చూడకుండా ఉండలేక పోతున్నా రా ఎంత మనసుకు సర్ది చెప్పుకోవాలి అనుకున్నా నేను ఉండలేను రా పోని రోజు ఫోన్ అయిన చేస్తావ్ అమ్మా తిన్నావా అని అడుగుతావని అనుకున్నా అది కూడా చేయడం లేదు. నేనంత తప్పేం చేసానా అని ఆలోచిస్తూన్నా నిద్ర పట్టడం లేదు ఇరవై నాలుగు గంటలు ఇదే ఆలోచన, పోని నేను ఫోన్ చేసినా రెండు మాటలు అది కూడా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావ్ కానీ మనస్ఫూర్తిగా ఒక్కసారి మాట మాట్లాడడం లేదు. అరేయ్ ఇన్నాళ్లు అందరూ నాతోనే ఉండాలని అనుకున్నాను. కానీ ఒక్కసారి గా నాకు ఒంటరి అయిన భావన కలుగుతుంది ముగ్గురు పిల్లలు ఉన్నా కూడా నేను ఇప్పుడు ఒంటరిని అయ్యాను నాన్న ఉన్నప్పుడు మీ గురించి ఎన్నో కలలు కన్నాము, ఇప్పుడా కలలాన్ని కల్లలు చేసి, అక్క అన్నా చెప్పినట్టే నా నెత్తిన కొట్టావు. చిన్న అమ్మ లేకుండా నువ్వు ఉండవచ్చు ఎందుకంటే నీకు ఒక తోడు దొరికింది కాబట్టి కానీ నువ్వు లేకుండా నేను ఉండలేను రా . ఇది నీకు అర్థం అయ్యేసరికి ఎన్నాళ్లు పడుతుందో కానీ నాకు మాత్రం రోజు ఏడుపుతో సరిపోతుంది నీ కోసం ఎన్నో కలలు కన్నాను ఎన్నో ఖర్చు పెట్టాను ఎవరి మీద ఎక్కువ ప్రేమ పెంచుకోకు అని అందరూ అంటున్న నీ పైన ఎక్కువ ప్రేమ పెంచుకున్నందుకు నాకు తగిన గుణపాఠం చెప్పావు అరేయ్ చిన్న ఇప్పుడు నువ్వు నాకు గుణపాఠం చెప్పావు కానీ రేపు అంటూ ఒకరోజు వస్తుంది ఆరోజు నీ పిల్లల నీకు గుణపాఠం చెప్పకూడదని నా కోరిక ఎందుకంటే ఇప్పుడున్న నీ తరమే ఇలా తల్లి నీ ఒంటరిని చేస్తే వచ్చే తరం అంటే నీ పిల్లలు ఇంకా మిమ్మల్ని ఎంత ఒంటరి చేస్తారు అనే నా భయం అందుకే చెప్తున్నా జాగ్రత్త చిన్న ఎప్పుడూ నీ మంచి కోరుకునే నువ్వు వద్దనుకున్నా నిన్ను
కావాలనుకునే నీ తల్లి.ఇంకా చాలా చెప్పాలని ఉంది. కానీ ఈ ఉత్తరం కూడా మొత్తం చదువుతావో లేదో అని భయంతో కాస్తే చెప్తున్నా ఎప్పుడూ నా మాట వినని నువ్వు ఈ ఉత్తరం కూడా చదువుతావో లేదో, కానీ చదువుతావని చిన్న ఆశతో రాస్తున్న…. తప్పకుండా చదువు సమయం వచ్చినప్పుడు నీకు అనుభవం అవుతుంది అందుకని నిజంగానే ఎవరిపైనా ప్రేమలు పెంచుకోకు.. ఉంటాను జాగ్రత్త చిన్నా….

ప్రేమతో
ఓ తల్లి
ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుంటూ సుధీర్గంగా నిట్టూర్చి తన తల్లి ఎంత వేదన పడిందో ఇప్పుడు తాను పడుతున్న వేదన ముందు తాను తన తల్లిని ఎంత వేదనపెట్టాడో అర్థమవుతుంది ఒంటరిగా ఒక చిన్న గదిలో ఉన్న చిన్న ఆ ఉత్తరాన్ని మరోసారి చదవాలని మళ్లీ తీశాడు కళ్లద్దాలు సర్దుకుంటూ…..

-భవ్యచారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *