మహమ్మద్ రవూఫోద్దీన్
ఆసరకై అరులు చాచిన
సృష్టికి మూలమూర్తిని
కల్లబొల్లి కబుర్లు చెప్పి
అగాధంలో నెట్టివేసే
హస్తాలు ఎన్నో
నీ అందము
అందిన చందమామ
నీ నవ్వే నా చీకటి బతుకులవెన్నెల అంటూ ఊరించి
నేడు
మాటలతోనే
వలువలు ఒలిచే
నోళ్లు ఎన్నో
అర్థం చేసుకునే నాథుడు లేక
రోజుకు ఎన్ని ఆర్తనాదాలు
నాలుగు గోడల మధ్య
శిధిలమవుతున్నయో కదా
ఇది నా స్వీయ రచన