అరిటాకు 🌻

🍒🌼మొదట్లో అరిటాకు మధ్యలో ఆగీతా అలా ఉండేది కాదంట.

🌻ఒకరోజు విందులో శ్రీరాముడు హనుమంతుడు ఒకే అరిటాకులో బోంచేయాల్సిన వేళ శ్రీరాముడు ఆకులో సగానికి అలా గీత గీసారంట.

🌻రామయ్య హనుమయ్య ఎదురెదురుగా కూర్చుని భుజించ ప్రారంభించారు.

🌻రామయ్య వైపు ఉన్న ఆకులో మానవులం తినే ఆహారాన్ని ఉంచగా హనుమయ్య వైపు వానరాలు తినే ఆహారాన్ని అని ఉంచడం జరిగిందంట.

🌻అప్పటి నుండి అరిటాకులో అలా గీత రావడం మొదలైందంట.

🌻అందరికి అనుమానం అరిటాకు తినేవారి ముందు ఎటువైపు ఉంచి వడ్డించాలి అని.

🌻కూర్చున్న వారి ఎడమవైపున చిన్నదైన మూల భాగమును వెడల్పైన భాగాన్ని కుడివైపున ఉండాలంట.

🌻మనం కుడిచేతితో కలుపుకుని తినాలి కానుక అటువైపు విశాల భాగం ఉండాలని పెద్దలు చెప్పారు.

🌻ఆకులో మొదట వడ్డించిన విస్తరిలో తీపి తినాలని ఎందుకు అంటారు. ఎడమవైపు పైభాగాన తీపు పళ్ళు అన్ని వడ్డిస్తారు.

🌻ఆహారానికి ముందు తీపి తీసుకోవడం వల్ల మన జీర్ణవ్యవస్థ చురుకుగా మొదలై మనం తీసుకునే ఆహరం బాగా జీర్ణం అవుతుందని తీపిని మొదట తినమంటారు.

🌻ఇలా ఎన్నో ఉపయోగాలు ఉండడం వల్లనే మన పెద్దలు ఎటువంటి శుభ అశుభ కార్యక్రమాలకు ఈ అరిటాకులనే వాడేవారు.

🌻మన ఇంటికి వచ్చిన అతిథి ఆరోగ్యంతో ఉండాలనే ఆలోచన వల్ల కానీ ఆ సంప్రదాయాన్ని మరిచి ప్లాస్టిక్ ఆకులు ప్లాస్టిక్ ప్రేమలు ఎక్కువయ్యాయి ఇప్పటికైనా మారుదాం
ఇట్లు
మీ
కోటేశ్వరరావు ఉప్పాల

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *