అవనీకన్యక

అవనీకన్యక,,,,,,,!!

వేకువజామున పసిడి వన్నెల తూరుపున లేత మందారం కాంతులతో సూరీడు పొడసూపగా,,,,,,,
ప్రకృతి కన్యక హరివిల్లు సొగసులద్దినట్లు రంగుల చీరతో ముస్తాబవుతోంది,,,,,,,
కన్నె సొగసులతో అందాలు చిందే మిసమిసల సుందరీమణియై అవని ప్రకృతి సహజ వేకువ స్వరాల సందెవెలుగుల జవ్వని సరాగాల కూజితాలలో ,,,,,,,,,
ఉల్లాసంగా పరుగులెత్తే జింకపిల్ల మల్లే యువనారీమణి ఆహ్లాదంగా జోరుగా హుషారుగా హృదయం విప్పి కొసమెరుపు మనోహర గీతాలు గళంలో రంజిళ్ళు సప్తస్వరాలు ,,,,,,,,,,,
ప్రకృతిసిద్ద అవనీ కన్యక యువరాకుమారిలా సుగంధ కస్తూరి పరిమళాల తేజరిల్లే నందనవనాలతో అనంత ఆకాశమే వంగి ఆవనిని ముద్దిడిన చందం,,,,,,,,,,
ఆ దృశ్యం సురుచిరం సుందరం అపురూప దివ్య కావ్యం తెల తెలవారుతుండగా దేదీప్యమానంగా దైవం దిగివచ్చి దీవెనలందించిన చందం,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *