ఆకుపచ్చని సిరుల జీవగడ్డ

ఆకుపచ్చని సిరుల జీవగడ్డ

సౌందర్యామా నేనిక్కడ
ఆకుపచ్చని సిరుల కొండలు
పచ్చని పూవులు విరబూసినట్లు
అల్లుకుపోయిన వృక్షాలు
గిరులన్నీ ఆకుపచ్చని సిరులు
ఊగిపోతూ తూలిపోతూ వృక్షసముదాయం
కెరటాలుగా వీచే జీవం ఉట్టిపడే గాలులు
ఆకుపచ్చని సముద్రంలా హోరెత్తే పవనాలు
హృదయాన్ని హత్తుకునే దృశ్యం
గిరులపై లయబద్ధంగా వృక్షాల రాపిడి శబ్దాలు
లతలతో అల్లుకుపోయిన వృక్షసముదాయం
నిండుగర్భిణిలా గిరులన్నీ నెమ్మదిగా ఊగిపోతూ
వనాల నిండా జంతుజాలములు, మృగాలు
ఒకదాన్నొకటి కరుస్తూ అరుస్తూ కీచులాటలు
మనిషన్నవాడికి గుండెలు గుబేల్మను భయానకం
ఆకాశంలో రంగు పూల నక్షత్రాల్లా పక్షుల స్త్వైరవిహారం
ఊహల కందని భాష్యాలు చెట్లకొమ్మల ఊగిసలాటలో
రకరకాల ధ్వనులతో భీకర సంగ్రామంలా
అరణ్యం ఊటలో పారే వాగులు వంకలు
సిరుల జీవగడ్డ అడవిని కబళించే మనిషి మనిషేనా !?
గిరుల పక్కనే వేసిన రహదారులు
కోడెనాగులా బుసలుకొడుతూ వాహనాలు
వృక్షాలను నరికేస్తూ జీవాలను చెరబడుతూ
మనిషి అనేవాడు నరరూప రాక్షసుడు
ఉన్మాదియై పచ్చదనాన్ని చిదిమేస్తే
ప్రకృతి వైపరీత్యాలతో నిలువ నీడలేకుండా భస్మమైతాడు
నీవునరునివి వానరునివి ,క్రూర రాక్షసునివి కాదు.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *