ఆడపిల్ల కామాంధులకు పెట్టే చితి

అమాయక ఆడపిల్లల
చుట్టూ మృగరాక్షసులు
ముళ్ళ పొదలపై నడక నేటి ఆడపిల్లలు
అక్షర జ్ఞానంలేని మూఢులు
కామపిశాచాలు తలలో తిరుగుతూ
చదువులలో మేటైన
సున్నిత మనస్కులు ఆడపిల్లలపై
ఒంటరినిచేసి అకృత్యాలకు పాల్పడే జులాయిలు
మదమాత్సర్యాలతో మూసుకుపోయిన కళ్ళు
ఆడపిల్లల మాణప్రాణాలకు
రక్షణలేని సామాజం
నీచనికృష్ట సంస్కృతిలో
సంప్రదాయ కుటుంబాలలోని
అమాయక ఆడపిల్లలు మణలేని దుస్థితి
ఈ ఆడపిల్లలు విజ్ఞాన గనులు
నైతికవిలువల మధ్య పెరిగిన
చదువుల సరస్వతులు
లోకంలో ఇలాంటి నీచులు
పుట్టగానే ఉగ్గుపాల బదులు
గాడిదపాలు తాగిన మొరటు మృగాలు
తాగుడు ,తిండి తైతక్కలు తప్ప
చదువుల విలువలు,జ్ఞానం లోతులు తెలియని
నికృష్ట కలియుగ దుశ్శాసనులు
చదువుల కోవెల చుట్టూ
వెర్రిగంతులు వేసే పిశాచాలు
అంతవరకు ఏమీ తెలియని అమాయక అమ్మాయిల పాలిట
యమకింకరులు ఈ దున్నపోతులు
ఈ క్రూరమృగాలను ఎక్కడికక్కడ
ఏరిపారేయడమే తక్షణ కర్తవ్యం
అయితే ఎన్ కౌంటర్ చేయడంతోనే
ఈ అకృత్యాలు సమసిపోవు
ఓ పదేళ్ళపాటు నీతి ,నియమాలు
సామాజిక విలువలు, కట్టుబాట్లు గల
నీవు మనిషివి సమాజంలో నివాసిస్తున్నావు
క్రూరమృగాలు సంచరించే దండకారణ్యంలో కాదు
ఇలాంటి చిత్రాలను ప్రదర్శిస్తూ
మానవత్వం ప్రభోధించే జీవనవిధానం
ప్రభోదించాలి చెరసాలలో వేసి
జీవనశైలి రుచిచూపించాలి
లేనిదే సమసమాజం ఎన్నాళ్లకు మారదు,,,,,,,!!

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *