ఆడవాళ్ళ కే శాపం

అక్షర కొరకు
అంశం – నిందలతో కాపురం
రచన – ఉమాదేవి ఎర్రం

శీర్షిక – ఆడవాళ్ళ కే శాపం

ఏ నిందలైనా ఆడవారికే
ఆడవాళ్ళంటే అందరికీ అలుసు
వారు భరించేది మీకేం తెలుసు
నిప్పులాంటి నిజాలు మరుగు!

మగవాళ్ళు ఎవరితో మాట్లాడినా ఒప్పు
ఆడవాళ్ళు మాట్లాడితే తప్పు
అదీ మగవాళ్ళతో అయితే ముప్పు
నిందించడం ఎందుకు చెప్పు?

ఇక పెళ్లి చేయడం అనాది ఆచారం
ఎలాంటి వాడైనా తప్పదు కాపురం
భరించడమే ఆమెకు తప్పని జీవితం
చచ్చే వరకూ సాధిస్తూ చూపించు నరకం!

ఎంతో సహనం గా భరించినా
వేస్తారు సమాజం నిందలు
క్షమాగుణమే ఆమెకు ఇచ్చెను దేవుడు
క్షమించడమే ఆమె సహనం ఓర్పు!

మగవాళ్లూ ముఖ్యంగా మెుగుళ్లూ
ఇప్పటికైనా ఆడవాళ్లను ( పెళ్లాల )ను
అనుమానించడం, నిందించడం
మాటలనడం మానేయండి!

స్త్రీ జన్మకు ఎందుకో ఈ శాపం
మరు జన్మకైనా కావాలి వరం
జన్మ జన్మ కు ఇవ్వాలి మెాక్షం
యత్ర నార్యస్తు పూజ్యంతే
రమంతే తత్ర దేవతాహః!

ఇది నా స్వంత రచన అని హామీ ఇస్తున్నా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *