ఆత్మలో లీనమైన పరంజ్యోతి,,,,,!!
నా జీవితం ఆఖరి క్షణాల దాకా
నా గుండె గూటిలో నీ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయి
విశ్వవీణను మీటినట్లు నీ గళం పాడిన సుమధుర గీతాలు నాలో జీవజలములైన స్ఫూర్తిదాతలు
వృధాగా పడివున్న శిలలకు జీవకళ అద్డినట్లు నీవు చిత్రీకరించిన బ్రతుకు చిత్రాలు ఎప్పటికీ చైతన్య జ్వాలలే
నీ మనోహర నఖచిత్రాలు ఉల్లాసపరిచే జీవనజ్యోతులు
నీ రచనలు సామాజిక సమస్యలు ఇట్టే పరిష్కరించే వెలుగు పుంజాలు
సప్తస్వరాలు పలికించే నీ ఫ్లూట్ వాయిద్యం నిన్ను అమరుణ్ణి చేసింది
సామాజిక సమస్యలు ,జీవన పోకడలను కవిత్వంగా రచించినవి ఎన్నటికీ
అజ్ఞాన తిమిరాలను పారద్రోలే సాహిత్య నూతనపోకడలు
నీవు అందించిన జ్ఞానం జ్యోతియై నీ పుత్రుని గుండెల్లో వెలుగుతూ చిరంజీవివయ్యావు
ఎన్నెన్నో ఉద్గ్రంథాలు అధ్యయనం చేసిన మేధావివి విశ్వకవి రవీంద్రుని కోవకు చెందిన మాహాజ్ఞానివి
జీవన విలువలకు పరంజ్యోతివి లౌకికజ్ఞానం,అలౌకికజ్ఞానం నీలో అలరారిన మహాసముద్రం
గుండెలనిండా దుఃఖం ఉన్నా ఎవరితో పంచుకోకుండా నీలోనే కుమిలి కుమిలి నీతోనే తీసుకెళ్లిన అమరుణివి శ్రీకృష్ణునివి,,,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట