ఆదిమానవుడు ఎప్పుడైతే అగ్నిని కనిపెట్టి తను తినే పదార్థాలను వేడివేడిగా తింటున్నప్పుడు ఆ ఉష్ణం తగులుతున్నప్పుడు, అది ఒక లేహ్యంలా పనిచేసింది. గొంతులోని స్వరతంత్రులు వికసించాయి. వాటితో పాటు వినికిడి నాడులు పనిచేసి తన చుట్టూర వస్తున్న శబ్దాలను వినగలిగాడు.ఆ వినికిడితో పాటు కాలక్రమంలో మాట అనేది ఉద్బవించింది.నెమ్మది నెమ్మదిగా తన అవసరాల కనుగుణంగా మాట్లాడటం మొదలయ్యింది. ఆది మానవుని మొదటి దైవాలు సూర్యచంద్రులు. ఆలోచనలు ఉద్బవిస్తూ తినే తిండి మార్పిడి, చరించే ప్రదేశాలను బట్టి ,వాళ్ళ మధ్య ఘర్షణలు,వాతావరణంలో భీకర స్థితిగతులను బట్టి రకరకాల దేవుళ్ళు ,దయ్యాలు, సైతాన్ లు ఉద్బవించారు. తాను దైవాన్ని నమ్మడం దగ్గర నుంచే కట్టుబాట్లు ,నియమ నిబంధనలు ఏర్పడ్డాయి. మానవ అస్తిత్వం పురోగతి సాధ్యపడింది.
అపరాజిత్
సూర్యాపేట