ఆనందాల పరవళ్లు!

ఆనందాల పరవళ్లు!

జాజిమల్లెలు విరబూశాయి
అల్లనేరేడు పళ్ళు దురపండాయి
ముకులించిన ఎర్ర గులాబీ మొగ్గలు
మందార మకరందాలు గ్రొలే తుమ్మెదలు
కారుమబ్బులు నిండిన ఆకాశం
శీతాఫలాల నుండి తీయనివాసన
తేనె కళ్ల చిన్నది తెల్లని వన్నెల మిస మిసలు
మదిని దోచు మత్తిలు పూల గుభాలింపు
ఆనందాల హరివిల్లు తెల తెలవారగనే
లబ్ డబ్ లు మరచిన హృదయం!
స్వప్నంలో అందగత్తె దరహాసంతో పలకరించినట్లు
పూలను అలంకరించుకుని పళ్లు ఆరగించినట్లు
ఆ సుందరి మదిలో ఎవరున్నారో ఏమో!
తొలి సంధ్య కాంతుల మిల మిలలు
ఊగే చెట్టు వీచే గాలి మనస్సు రంజిళ్ళు
ప్రేయసి తీసే కూనిరాగాలు
సముద్రంపై నుంచి వీచే చల్లని మలయమారుతంలా
భువిన విరిసిన పూలు నక్షత్రాలకు జడకొప్పై
ఎర్రగా పండిన పళ్లు సూరీడు ఆరగింపు
గోరు ముద్దలు తినే పాపాయి నవ్వులు
తేనె పూల వెన్నెల పరవళ్లు!
తేనెలు గ్రోలుతున్న తుమ్మెద
జవ్వని హృదయాన్ని దోచేస్తున్నట్లు!

ఆపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *