ఆర్.వెంకట్రామన్(భారత మాజీ రాష్ట్రపతి, రాజనీతివేత్త, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు)

ఆర్.వెంకట్రామన్ (డిసెంబర్ 4, 1910 – జనవరి 27, 2009) భారతదేశ 8వ రాష్ట్రపతి (1987-1992), స్వాతంత్ర్య సమరయోధుడు, రాజనీతివేత్త మరియు న్యాయవాది. క్విట్ ఇండియా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఆయన, కేంద్ర మంత్రిగా, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా సేవలందించారు. రాజ్యాంగ నిర్మాణంలోనూ ఆయన పాత్ర ఉంది.

1942 క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని, బ్రిటీష్ వారిచే అరెస్టయ్యారు. 1950లో తాత్కాలిక పార్లమెంటుకు ఎన్నికయ్యారు.
కేంద్ర ఆర్థిక, రక్షణ మంత్రిగా పనిచేశారు.
1984-1987 వరకు భారత ఉపరాష్ట్రపతిగా, 1987-1992 వరకు 8వ రాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వర్తించారు.
మద్రాసు హైకోర్టు, సుప్రీంకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. ఆయన సేవలకు గాను “తామ్ర పత్ర” అవార్డును పొందారు. జనవరి 27, 2009న న్యూఢిల్లీలో కన్నుమూశారు.

రాజ్యాంగం మరియు రాజకీయాలపై ఆయన సుదీర్ఘ అనుభవం, నిశ్శబ్ద రాజనీతిజ్ఞుడిగా ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమైనవి.

మాధవి కాళ్ల
సేకరణ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *