అందాల లోకం ఆ హృదయ సమీరం.
చిత్రకారుని మానసం ఇంద్రధనస్సు వర్ణమయం
అరుణరాగమై రవికాంతుని ఆగమనం.
ఆ గిరితరులను ముద్దాడుతూ
సింధూరాన్ని విదిలిస్తూ భూమాతకు దిద్దుతున్నాడు
సింధూరాన్ని ముద్దులులకు మోముతో దినకరుడు.
మంచు పల్లకిలో గాలి తరంగాలపై లేలియాడుతుంది
స్వేతపు తెర .పచ్చ చీరను కట్టి ప్రకృతి అందాల విందు వినోదాలు .రమణీయమే ఆ తరువుల పరువపు వన్నెలు.దారులు తీర్చిన పంట చేల రహదారులు.. గిరులపైనే మడుల సోయగాలు .ఎన్నెన్నో వన్నెలు ధరణి మాత ధరమున అద్దిన వర్ణాలు చిత్రకారుని హృదయ వీక్షణాలు .
ఆలపాటి వారి అమ్మాయి సత్యవతి
నా స్వీయ రచన నా హామీ