ఆలోచనల సమతుల్యతతోనే మేథస్సు వృద్ధి

క్రియాత్మక ఆలోచనలు ప్రియం అమృతం
యావత్తు ప్రపంచం చరించేది
ఆలోచనల సమతుల్యతే సంజీవనులు
మనస్సు లోపలి మనిషి
వెలుగు వసంతాలు అవనికి జీవం
తాత్విక సహేతుక ఆలోచనలే
జిజ్ఞాసుల ఆలోచనల శ్రమలతోనే జగత్తుకు ఊపిరులు
మేథస్సు ఉజ్వలంగా ప్రజ్వరిల్లితేనే జ్ఞానం ఉనికి
ఎన్నెన్నో శాస్త్రపరిశోధనలే నేటి నూతన పుంతల జగత్తు
మనస్సు మూలాలలో జిజ్ఞాస ద్విగుణీకృతమయ్యి
మనస్సులో జ్ఞాన అగ్ని జ్వలిస్తేనే నూతన ఆవిష్కరణలు
నిరంతరం గ్రంథ అధ్యయనంతో
క్రమపద్ధతిలో వాడియైన ఆలోచనలు శాస్త్రపరిశోధనలకు నిలయాలు
మనస్సు సంక్లిష్ట వ్యవస్థను ఉపయోగిస్తేనే వినూత్న రూపం దిద్దుకుంటుంది
సామాజిక దృక్పథాన్ని కొత్తకోణంలో మార్పుకు దోహదం చేసేవారు తాత్వికులు
వెన్నపూస లాంటి మనస్సు నాడులతో అల్లుకుపోయిన సృజనశీలియైన జ్ఞానతృష్ణ,,,,,,,
విజ్ఞానం సుదీర్ఘ కాలంగా తన సేవలు అందించడానికి ఆలోచనాపరులు శాస్త్రజ్ఞుల శ్రమల సాఫల్యత,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *