ఆలోచనా తరంగాలను

నీ మనస్సులో నిగూఢంగా పీడస్తున్న ఆలోచనా తరంగాలను , నీ దుఃఖిత మది వేదనలను,సృజనాత్మకమైన రూపకల్పన చేసుకుంటూ అక్షరీకరించగలిగితే, క్రమక్రమంగా నిన్ను నీవు ఆవిష్కరించుకునే క్రమంలో ,నీలో దాగివున్న వెన్నెల వెలుగుల తేజస్సు కెరటాలు కెరటాలుగా ఉద్బవిస్తూ, నీకు తెలియకుండానే నిన్ను నీవు జీవిత ప్రస్థానం పొడుగునా సంస్కరించుకుంటూ, కష్టసుఖాలను సమానంగా గమనించిఅనుభవిస్తూ ,బహుదూరపు బాటసారివై గాయాలు గేయాలై, నీ జీవితం పుటలన్నీ తెరచిన పుస్తకమై బహుదూరపు బాటసారివై, జీవిత సంద్రాన్ని ఈదుకుంటూ సాగిపోయే సమాజానికి మార్గదర్శివి.వెలుగు దివిటీవి.
అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *