ఇంటి భోజనమ్ము నింపుగా లేదంచు
వీధిలోన దినుచు విర్రవీగ
లేనిపోని జబ్బు మేనిలో జొరబడు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
మందుషాపు లోన మగవాడు దూరినా
వస్త్ర షాపులోన వనితజేర
యిల్లుచేరు దారి యిలలోన దొరకునా
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి!రేపాల!సూర్యాపేట!