ఆధునికము పేర ఆహ్వానమున్ బల్కి
చెడును చేర్చుకొనిన చితుకుచుంద్రు!
సంప్రదాయములను సౌకర్యములనుచు
ఆదరించిన యెడ యవనిమెచ్చు!!
భోగిమంటన చెడు బుద్ధులు గాల్చుము
సంక్రమించుకొనుము సద్గుణములు!
సుహృదయమ్ము తోడ శోభిల్ల వలెనని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
మందు చికెను మటను మాయింట లేవయ్య
కల్లు సార బీరు గానరావు!
గారెలు సకినాలు పూరీలరిసెలకు
నిండుకుండ వినుము నిజము కృష్ణ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!