ఆ!వె!!💐💐💐💐

కూటికి కరువైన కోటేశ్వరులుగాను
గుడిసెలోన బ్రతుకు గుణముచేత!
అప్పు రోగము పగ అంటరానివనుచు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

చదువుసంధ్య సిరులు పదవులనేలుచు
భూములు భవనాలు పొందుచుండి
వెంట వెంట తిరిగి వెన్నుపోటు పొడుచు
సొంత కులము వారె
చూడు కృష్ణ!!

నీతిలేని కుక్క నీవెంట నావెంట
కాచుకొనుచు తిరుగు కాటు వేయ!
కాటువేయ జూడ కఠినంగ శిక్షించ
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

కం!!🚩🚩🚩💐

తప్పుడు పనులను జేయక
చెప్పుడు మాటలను వినక చిత్తమునందున్
ఒప్పులు తప్పులనెంచక
మెప్పును పొందంగ వలయు మేదిని కృష్ణా!!

మందులు మాకులు గ్రోలుచు
విందు వినోదములు గోరి విరివిగ జేయన్
బొందల గడ్డలు మురియుచు
సందడి జేయంగ బిలుచు శమనుడు కృష్ణా!!

శమనుడు/యముడు

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *