ఆ!!వె!!💐💐💐

వార్డు వార్డు దిరిగి వరుసలు గలుపుచు
ఓట్లు గోరి నేత నోట్లు బంచు!
నోట్ల కాశపడిన నోటమట్టిని గొట్టు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

పంటపొలములమ్మి పదవుల వేటన
ప్రాణమిడువ బోకు పదవి రాక!
పదవి కన్న భువిని భార్యబిడ్డలు మేలు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

ఊరివారి కొరకు పోరుజేయుట కన్న
దారసుతుల కొరకు దారిజూపు!
గుణము యొక్కటున్న గొప్పగా బ్రతికేవు
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!

గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *