కమ్మరీడు చేత కత్తికి పదునెక్కు
సుత్తితోడ శిలకు శోభగలగు!
వత్తి వెలుగులీను వృత్తిదారుల చేత
నత్తివారినైన నమ్మిన యెడ!!
పాలుద్రావి తల్లి పాలన మరిచేటి
సంతుకన్న దుష్ట జంతువేది?
ప్రజల కలలు మరచు పాలకులింతేను
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
విద్య గూర్చుచు బడి వినయమ్ము నేర్పుచు
బాధ్యతలను విధిగ పట్టిచెప్పు
పాఠశాల కాదు బ్రతుకు దిద్దెడి గుడి
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట!!