కుక్క తోకకెన్ని గుండ్రాళ్ళు గట్టినా
తోకచక్కనవదు తుదకు తెగును!
నీచునికిల బుద్ధి నేర్పిన ఫలమేమి?
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
చెట్టుపేరు జెప్పి బుట్టెడు పళ్ళను
అమ్మి బ్రతుకబోకు అవనిపైన!
కష్టపడిన సొమ్ము కాసైన చాలని
తెలుసుకోర కృష్ణ తెలివితోడ!!
గడ్డం కృష్ణారెడ్డి.రేపాల సూర్యాపేట