ఆ క్షణాలు రాసినవి లేఖలే…!!!
రెక్కలు విప్పని నిర్మలాకశంలో
పొద్దుపోడుపో అది సంధ్యల వార్పో…
వాలిపోతున్నదో లేక తెలిపోతున్నదో ఏమో
కన్ను కాచిన తీరుకు సమయం కావాలంటే
ఆ…వేళలో మనస్సులు పలకని మౌనమే…!!
హృదయం విప్పని రాగాలతో మధించిన
భావస్పర్షలు తెలిపిన మననాలతో లేఖలే…
అనుభవాలు జ్ఞాపకాలు జీవితాన
ఒకెత్తయితే రెండు మనస్సుల ప్రయత్నం
ఒకటై అనుబంధాలను ముడేసుకొంటు…!!
ఒకరికొకరై అనురాగాలను పంచుకొంటు…
కష్ట సుఖాలలో వీడిపోక వేచే అడుగులు
పదిలమై అన్యోన్యాలను కలుపుకొంటుంటే…
పరిస్థితులకు ఆ క్షణాలు రాసినవి లేఖలే…
గడిచిన రోజులు దూరమైపోయిన
జరిగిన కథలుగా చెప్పుకొనే నాలుకపై
బతుకుతు తీపిగుర్తులను రుచి చూపించే
ప్రేమలు బతుకారని తడులతో సందేశాలే…
రాసుకొన్న లేఖలతో అది క్షేమసమాచారమే…
ఏ ప్రాంతమైనా ఏ దేశమేగినా ప్రేమలు
శ్వాసలతో మొలుపే సాహసాల పిలుపే…!!
ఐనా కాకపోయినా వెనకాడని ధైర్యంతో
కత్తిమీద సాములా కాఠిణ్యాలకు తలొగ్గక…
గడిలో బంధీకాక తనలో త్యాగాన్ని ఒదలక…
తలచిన మదిలో నిలిచిన రూపమదేనని…
కాలం చీకటి వెలుగులతో మారే రంగేకాదు
ప్రేమతో వేసుకొంటే అవి దారులు కూడానని
అందరి కొరకు ప్రేమతో రాసిన ప్రేమలేక….
దేరంగుల భైరవ (కర్నూలు)
91100688396