ఆ ప్రభువే దైవమని…!!!
నిరంకుశం పెచ్చురిళ్ళుతుంటే…
అహంభావాలు శాసనాలవుతుంటే
ఆలోచనలు లేని పామరుల లోకం
దుఃఖ సాగరాన మునిగిపోరాదని…
పరలోక పరిశుద్ధాత్ముడు ఇలపైన
శాంతి కరుణలకు రూపమై నిలిచాడు…
నువు పుట్టింది మొదలుకొని…
కొలిమిగాల్చిన సంఘంలో పొంగిన
ఆటుపోటులు చేసిన గాయాలెన్నో…
ఓదార్పువై సహనం రాసిన పరీక్షలెన్నో…
వదిలిన శ్వాసలు మేఘాలై కమ్ముకొని
మోపిన అడుగులతో ప్రేమలు పంచేది
ఫలితం ఆశించిన ఆ ప్రభువే దైవమని…
స్వార్దం పెరిగిన పాలకులతో
ప్రజల ఆశయాలు అణగారిపోరాదని…
దేహం శాశ్వతం కాదని దానిపై ఎందుకు
వ్యామోహమని భుజాన శిలువను మోసి
పాపాలను కడిగిన శాంతిస్వరూపుడు…
సాక్ష్యం చెప్పని పరిస్థితులతో కన్నుకార్చక
నిరంతరానికి బంధిగానే నిలిచాడు…
మనుషుల మనుగడలు కాలంతో
ప్రయాణమైనా వెంట కొనిపోయేది లేదని
ద్వేషం వీడిపోయి ప్రేమాప్యాయతలను
పంచుకొంటే మిగిలేది మంచి చెడులేనని
ధారపోసిన జీవితమై గాఢాంధకారంతో
కూరుకుపోయినా కురూపులను చేరదీసి
విముక్తికి జీవనం పోసిన కరుణామూర్తి
కారణజన్ముడు యేసు ప్రభువు…
దేరంగుల భైరవ 🖋️(కర్నూలు)
9100688396