ఇదీ పాటంటే,,,,,!!
ఆ రాత్రి ఓ సుప్రసిద్ధ గాయకుడి గాన కచ్చేరికి వెళ్ళాను.ఆయన గళం తేనీయలు చిందుతూ బహుమధురంగా వుంది. అతడు చివరిగా ఓ విషాద గీతం పాడాడు. గాయకుడి గళం నుండి కవి అక్షరాలు రాగయుక్తంగా తెగిపడుతున్నట్లు గద్గద స్వరంతో రోదనా గీతం పాడుతూవుంటే ,అమాంతం నా గుండెలు పగిలి విరిగి కూలిపడుతున్నట్లు రెండు కళ్ళల్లోంచి కన్నీళ్ళు కాలువలవుతున్నాయి.నిజంగా ఇంతటి దుఃఖభరితం జీవితం నాలాంటి వాళ్ళదే కాబోలు అనుకుంటూ ఇంటిదారి పట్టాను. ఆ రాత్రి చాలా సేపటి వరకు నిద్రపట్టలేదు.ఆ విషాదరాగం తొలిచి తొలిచి మనస్సు మూగబోయింది.ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో తెలీదు ప్రగాఢమైన నిద్రపోయాను.నిద్రలేచి చూస్తే అప్పటికే తెల్లవారు ఏడయింది. జీవితంలో ఏదో విషాదం తొలిగిపోతున్న వింత అనుభూతి. ఓ వారం రోజుల పర్యంతం నన్ను నేను ఓదార్చుకుంటున్న భావన. చివరికి గుండెల్లోంచి ఎదో బరువు దించుకున్న అనుభవం,హృదయం సేదతీరింది.,,,,,!!
అపరాజిత్
సూర్యాపేట