అక్షర కొరకు
బ్రేకప్ కథ
రచన – ఉమాదేవి ఎర్రం
శీర్షిక – ఇద్దరూ ఇద్దరే
జశ్వంత్ కి తన్వి అంటే చాలా ఇష్టం ఎందుకంటే చిన్నప్పటి నుండి ఒకే వీధి ఒకే స్కూల్ దాంతో కలిసి
ఆడుకోవడం కలిసి చదువ కోవడంతో ఇద్దరికీ ఒకరంటే
ఒకరికి ఇష్టం ఉండేది..
అది పెరిగే సరికి ప్రేమ అనుకున్నారు ఇద్దరూ ప్రేమలోనే
ఉన్నారు..
అది గమనించిన ఇరు వర్గాల పెద్దలు పెళ్లి కుదిర్చారు
ఇంకా అందరూ ఒప్పుకున్నారని పార్కుల వెంట సినిమాలకు షికార్లకు తిరగడం ఎక్కువైంది..
చనువు పెరిగి పోయింది..
ఒకరోజు పార్కులో కూచున్నప్పుడు
..
జశ్వంత్ మా వాళ్ళు అయితే నేను చెప్పగానే ఒప్పుకున్నారు
తెలుసా? అన్నాడు..
ఏం కాదు మా వాళ్ళు ముందు ఒప్పుకున్నారు అంది తన్వి..
లేదు లేదు మా వాళ్ళే
కాదు కాదు మా వాళ్ళే
ఇద్దరూ నాలుగు సార్లు వాదించుకుని బ్రేకప్ చెప్పేసు
కున్నారు..
చిన్నప్పటి నుండి కలిగిన ఇష్టం ప్రేమగా మారి నాలుగేళ్లు గడిచాక నాలుగు నిమిషాల్లో బ్రేకప్ అయి పోయింది..
అమ్మెా! ఇంకానయం ఇప్పుడే అయింది పెళ్లయ్యాక కాలేదు అనుకున్నారు ఇంట్లో వాళ్ళు .
వాళ్ళ గురించే పోట్లాడుకుని విడిపోయారని వాళ్ళకు తెలియదు పాపం…
ఇది నా స్వీయ రచన..