ఈ అంతుచిక్కని కాలం వేగంలో మనమెంత,,,,,,,,!!!???!!!.
గడియారంలో సెకన్ల ముళ్ళు కంటే ఎవ్వరికీ తెలియని అంతులేని వేగంగా కాలం పయనం,,,,,,,,,ఈ గుండెలు పాడే గీతం నేనొకడు ఉన్నానని గుర్తుచేసే ఊపిరి సంగీతం కాలం ప్రవాహంలో కొట్టుకుపోతున్న ధూళి,,,,,,,,,,,
ఆకాశంలో ఎగిరిపోయే రంగు రంగుల పక్షులు కాలం ఒడిలో సేదదీరుతూ అనంతానంత సుదూరాల్లో అంతర్థానమవుతూ కాలం గూళ్ళల్లో నిశ్శబ్దంలోకి జారుకుంటాయి,,,,,,,,,,,,,,
,తల్లిదండ్రులు, భార్యాబిడ్డలు, అన్నాచెల్లి, అన్నతమ్ములు ఇలా భవబంధాలన్నీ ఇట్టే తెంచుకుని అనంత విశ్వంలో నేనెంత ? కాలప్రవాహంలో కలిసిపోతూ,,,,,,,,,,,,
ఈ ధరిత్రిపై నా ప్రాణం పుట్టుక నా జీవనయాత్రలో నేను అనుభవించిన సుఖదుఃఖాలు నా బ్రతుకుకు అర్థంపర్థం లేని మనస్సు కయిన గాయాలు తృటిలోనే తెంచుకుని కాలగర్భంలో కలిసిపోతూ,,,,,,,,,
ఈ భువిపైకి ప్రాణం రాకడ పోకడ ఎవ్వరికీ అంతుచిక్కని రహస్యం విశ్వంతరాళంలో కంటికి గోచారంకాని కాలంలో కలిసిపోయే ఆలోచనలకు అందని మధురక్షణం కాబోలు,,,,,,,,,,,,,
ఈ భూలోకంలో ప్రేమలు ఆత్మీయతలు,మోసాలు ద్వేషాలు,కక్షలు కార్పణ్యాలు, ఒకరినొకరు నరుక్కోవడాలు, అత్యాచారాలు, మోహాలు,,,,,,
అన్నీ నీతోనే కనురెప్ప పాటులో మటుమాయం, కంటికగుపించని బ్యాక్టీరియాలం మనం సుదీర్ఘ కాలప్రవాహంలో,,,,,,,,,,,,,,
ఈ భువిపై మనుష్యులు చరాచర సమస్తప్రాణికోటి ప్రకృతి విపత్తులు ఈ సైన్స్ టెక్నాలజీలన్నీ కాలగర్భంలో కలిసిపోయే ప్రళయాలు,,,,,,,,,,,,,,
ప్రతిగా వేరొకటి ఉద్బవిస్తూ సాగిపోయే కాలం కోరలుసాచితే మనం బుద్బుదం,,,,,,,,
అపరాజిత్
సూర్యాపేట