ఈ ఆటోలోనే నేను పట్నం పల్లె తిరుగుతా,,,,,,!!

ఒకప్పుడు హైదరాబాద్ లో
ఓయ్ ఆటో,,,,, అంటే టక్కున ఆటో ఆపేవాడు ఆటోవాలా,,,,,,,,
వెళ్లాల్సిన ప్లేస్ చెబితే మీటర్లో ఎన్ని డబ్బులు ఇవ్వాలో దిగేప్పుడు చూపించేది,,,,,,
ఇప్పుడు మీటర్ మీద పది లేదా ఇరవై రూపాయలు ఇస్తేనే ఆటో తీస్తాడు,,,,,,,,,,
సిటీ ఆటోలో ముగ్గురు లేక నలుగురికే పరిమితి అంతకన్నా ఎక్కువ మంది కూర్చోరాదు,,,,,,,
ఈ మధ్యనే స్టీరింగ్ ఆటోలు వచ్చాయి. వీటిల్లో పది మంది దాకా తోసి తోసి కూర్చోబెడతారు సిటీకి కొంచెం నలుమూలల దాకా తిరుగుతాయి,,,,,,,,,,
ఈ హైదరాబాద్ లో డీజిల్ ఆటోఓనర్ రెంట్ ఖర్చులు పోను సగటున రోజుకు వెయ్యి రూపాయలు మిగులుతాయి,,,,,,,,
ఈ రోజుల్లో
ఆటోలు ప్రతి పట్టణం ఊరు వాడ తిరుగుతున్నాయి సిటీ ఆటోలు పట్టణాల్లో స్టీరింగ్ ఆటోలు పల్లెటూరు జనాన్ని పట్టణాలకు తరలిస్తున్నాయి.,,,,,,,,,,,
స్టీరింగ్ ఆటోల్లో కేవలం ఐదుగురికే పరిమితి కాని జనాన్నిబట్టి ఇరవై మందికిపైగా ఆడ మగ తేడా లేకుండా కుక్కికుక్కి ఎక్కించి విపరీతమైన స్పీడ్ తో గమ్యం చేరే దాకా అరచేతిలో ప్రాణం పెట్టుకుని ప్రయాణించాలి,,,,,,,,,
ఈ మద్య రోడ్ ఆక్సిడెంట్ అయ్యింది అంటే అది స్టీరింగ్ ఆటో అయ్యివుంటుంది కనీసం ఇద్దరో ముగ్గురో దుర్మరణం పాలవుతున్నారు,,,,,,,,,,,
వీళ్ళ సంపాదన పాడుబడ వెయ్యి రెండు వేలకు కక్కుర్తిపడి ఒళ్ళుతెలియని డ్రైవింగ్ తో కొందరికి డ్రైవింగ్ సరిగారాక చేసే డ్రైవింగ్ ఎలావుంటుందో మీరే ఆలోచించండి,,,,,,,,,,
ఈ స్టీరింగ్ ఆటోలకు యూనియన్లు టవున్లలో సీరియల్ ప్రకారం బండ్లు తీయాలి రోజుకు వెయ్యి రూపాయల సగటున కంటే ఎక్కువ సంపాదించలేరు ఖర్చులు పోను ,,,,,,,,,,,,,,,
ఎన్ని దుస్సంఘటనలు జరిగినా బస్సుల్లో ప్రయాణించడం కంటే ఆటోలే ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇంటిముందర దాకా వచ్చి దింపుతారు. మారుమూల పల్లెలకు సైతం ఆటో చొరబడుతుంది కాబట్టి,,,,,,,,,,,,
ఏయ్ ఆటో ,,,,,,ఓహో ఆటో,,,,,,,
నేను ఆటోవాన్ని,,,, ఆటోవాన్ని,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *