ఒకప్పుడు పెళ్ళి అంటే తరాలు చూసి ఇచ్చేవారు తర్వాత పెళ్ళి అంటే అబ్బాయి కి దూరాలవాట్లు ఉన్నాయా అని చూసి ఇచ్చేవారు. తర్వాత అబ్బాయికి ఆస్తిపాస్తులు ఉన్నాయా అని చూసేవారు, తర్వాత అబ్బాయికి ఏమైనా సంబంధాలు ఉన్నాయా అని చూసేవారు, తర్వాత అబ్బాయికి అక్కచెల్లమ్మలు ఉన్నారా అని చూసేవారు, తర్వాత అబ్బాయికి తల్లిదండ్రులు ఉన్నారా లేరా అని చేసేవారు, దాంతో పాటు ఆస్తులు ఏమున్నాయి చూసి ఇచ్చేవారు. తర్వాత తల్లిదండ్రులు ఉండొద్దు, అక్కాచెల్లెళ్లు ఉండకూడదు కానీ ఆస్తులు ఉండాలని చూసి పెళ్ళి చేసేవారు. తర్వాత అబ్బాయి ఫారిన్ వెళ్తాడా లేదా చూసేవారు, తర్వాత అబ్బాయి సాఫ్ట్వేర్ నా అని చూసేవారు. తరాలు మారినా ఇప్పటి కాలంలో అబ్బాయికి ఎవరు ఉండకూడదు. కానీ ఆస్తులు ఉండాలి, ఫారిన్ లో ఉండాలి. లక్షల్లో జీతాలు ఉండాలని కోరుకున్నారు.అలాగే ఇన్ని ఉన్నా అబ్బాయి కి ఎలాంటి దూరాలవాట్లు ఉండకూడదు అంటున్నారు. ఒక అమ్మాయిని ఇస్తున్నప్పుడు అబ్బాయి తరపున ఇన్ని చూస్తున్న వారు మరి అమ్మాయికి ఎలాంటి అఫైర్స్ ఉన్నాయో చెప్పడం లేదు, కనీసం వంట అయినా వస్తుందా అని అడగడం లేదు, పెళ్ళి అయ్యాక కనీసం మొగుడికి అయినా వండి పెడుతుందా లేదా రీల్స్ చేస్తుందా అని అడగడం లేదు. అమ్మాయి వచ్చాక ఇంట్లో కనీస అవసరాలు చేస్తుందా అని కూడా అడగడం లేదు. అమ్మాయి అయితే చాలు అనుకుని ఏమి అడగకుండా చేసుకుంటున్నారు.ఇవ్వన్నీ అడగకుండా చేసుకున్నా ఆ తర్వాత ఆమెకి భయపడుతున్నారు ఎందుకంటే ఏ డ్రమ్ములో చంపి పారెస్తుందో అని, ఇంట్లో ఎందరు ఉన్నా ఆమె ఏమి చేయకున్నా అణిగిమణిగి ఉండాలని, ఆమె అడుగులకు మడుగులు ఒత్తలని ఫ్రెషర్ తెస్తున్నారు. భర్తే ఇల్లు ఊడ్చి గిన్నెలు కడిగి, బట్టలు ఉతికి, ఆమెకి నచ్చిన వంటలు చేసి పెట్టిన తర్వాతే ఆఫీస్ కి వెళ్తున్నారు. ఇన్ని చేసినా కూడా ఆమె కేసులు పెడుతుందేమో అని క్షణం క్షణం నరకం అనుభవిస్తున్నారు. ఇదంతా అవసరమా అని అనుకుని పెళ్ళి చేసుకోవడం మానేస్తే బట్ట, పొట్ట వచ్చిందని పక్కవారి గోల ఒకటి అందువల్ల పెళ్ళి చేసుకుని వంశం నిలబడాలి అనుకుంటే దానికి కూడా పెళ్ళాం తల్లో, అక్కో ఇప్పుడే పిల్లలు వద్దు అని చెప్పడం తో పిల్లలకు పులిస్టాఫ్ పెడుతున్నారు. తల్లిదండ్రులు ఉంటే ఇంట్లోంచి వారిని వెళ్లగొట్టేంత వరకు మొగుణ్ణి వారిని మానసికంగా వేదిస్తున్నారు. వాళ్ళు బయటకు వెళ్ళాక తన వారిని తెచ్చుకుని పెట్టుకుని భర్త కు విలువలు లేకుండా వారికి ఒక జీతగాడి లా మారుస్తున్నారు. లేదు కాదు అంటే కేసులు, లేదా చంపడం లేదా అందినకాడికి ఆస్తులు దండుకుని పలాయనము అవుతున్నారు.చేసుకున్నా హోటల్ మే ఖానా మసీద్ మే సోనా అన్నట్టు పొట్లాలు తెచ్చుకుని తింటూ వాటిని కూడా సోషల్ మీడియాలో పెడుతున్నారు. అమ్మాయిలు భధ్రంగా ఉండాలని కోరుకోవడం లో తప్పులేదు. కానీ అది చాలా దూరం వెళ్ళింది వారి ఆలోచన విధానం మారింది. మేము, మాకే అన్నట్టు ఉన్నారు. నేను బాగుంటే చాలు నాకు ఎవరి అవసరం లేదని అనుకుంటున్నారు. చాలా పొగరుగా, అహంకారం నాకేం తక్కువ అన్నట్టు ఉన్నారు. దానికి తోడు చట్టాలు కూడా రావడం వలన విచ్చలవిడిగా ఎవడితో పడితే వాడితో వెళ్తున్నారు. వీరి ఆలోచనా విధానం మారడంలో తప్పులేదు కానీ దేనికైనా ఒక హద్దు ఉంటుంది. దాన్ని దాటితే వారి జీవితం నాశనం అవుతుంది అని గ్రహించలేక పోతున్నారు. మరి కొందరు రాత్రికి రాత్రే సెలబ్రిటీ అవ్వాలనీ బూతులు మాట్లాడుతూ, తాగుతూ, బైక్ రైడ్ లు చేస్తూ పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు. ఈ 2025 లో అమ్మాయిలు అమ్మాయిగా ప్రవర్తించడం పూర్తిగా మానేసి సగం సగం బట్టలతో అర్ధ నగ్నంగా విప్పుకుని తిరుగుతూ ఉండడం వల్లనే అనేక ఘోరలకు, నేరాలకు వారే పాక్షికంగా కారణం అవుతున్నారు అనడంలో అసలు సందేహమే లేదు. దీనిని నివారించాల్సింది ముందు తల్లిదండ్రులు, తర్వాత టీచర్స్, తర్వాత భర్త మొదట్లోనే కంట్రోల్ చేయాలి తప్ప చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే లాభం లేదని అమ్మాయిలు కూడా గ్రహించాలి, మీరు స్వేచ్ఛ గా ఉండండి తప్పులేదు. బట్టలు సరిగ్గా వేసుకోండి రీల్స్ చేయండి తప్పులేదు కానీ విలువలతో ఉండండి, సంస్కారం, సభ్యత, విలువలు, ఆచారాలు పాటించండి మీకు ఇంతగా స్వేచ్ఛ నీ ఇస్తున్నవారికి కనీస గౌరవం అయినా ఇవ్వండి అది తల్లిదండ్రులు అయినా అత్తమామ అయినా, భర్త అయినా, తోటివారైనా, మిమల్ని స్వేచ్ఛ గా ఉండమని చెప్పడం అంటే విచ్చలవిడిగా ఉండమని కాదు కదా… నా కూతురు, లేదా నా భార్య, లేదా నా చెల్లి, అక్కడ, కోడలు ఏ తప్పు చేయరనే నమ్మకం తో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా మిమల్ని మీరు కాపాడుకుంటూ, సమాజాన్ని కాపాడుతూ, ఆచారావ్యావహారాలకు విలువలు ఇస్తూ బతకండి, బతికించండి… మీరూ మీకు కావాల్సిన వారిని సంతోషంగా ఉంచండి అలాగని పబ్బుల్లో గంతులు వేస్తాం, తాగుతూ తిరుగుతాం అంటే పాడై పోయేది మీరు, మీ కుటుంబం మాత్రమే అని గ్రహించండి… ఇంకా చాలా ఉదాహరణలు ఉన్నాయి చట్టాలు మీ చుట్టాలు కావచ్చు కానీ ఎవడితో పడితే వాడితో పడుకుని వస్తాను అంటే కుటుంబం ఊరుకోదు అలాగని మీరూ ఒంటరిగా ఉండాలని చూస్తే ఆకు ముళ్ళు సామెత అవుతుంది. ఎలాగూ మొగుడు ఆఫీస్ కి వెళ్ళాక మీకు నచ్చిన వాడితో చాటింగ్, వీడియో కాల్స్ చేస్తారు కదా దాంతో సరిపెట్టుకుంటే బాగుంటుంది తప్ప మొగుడు అడ్డుగా ఉన్నాడని చంపేస్తే నేరం ఎక్కువ రోజులు దాగదు ఎప్పుడో ఒకసారి పట్టిస్తుంది పోలీసులు ఏమి తెలివి లేని వారు కాదు కొండను తవ్వి నిజాలు వెలికి తీస్తారు. కాబట్టి అరగంట సుఖం కోసం చంపడం, చావడం, మత్తుకు బానిస అవడం మానుకోండి. భారత దేశ మహిళలు అంటే పక్క దేశాలకు ఆదర్శం కానీ ఇప్పుడు విదేశీ వ్యామోహం లో మనవారే పడుతున్నారు. అందువల్ల తప్పు చేసేముందు ఒక్కక్షణం ఆలోచించండి. తప్పు చేస్తే ఏమి జరుగుతుందో మీ మీరు వారి జీవితాలు ఎలా మారతాయో తెలుసుకోండి, జాగ్రత్తగా ఉండండి. అందుకే పెళ్లప్పుడు ఆడపిల్ల కు చెప్తారు నలుగురు నోట్లో నానకు, నలుగురిలో నవ్వకు,అందరి కళ్ళలో పడకు, చెప్పుడుమాటలు వినకు అంటూ చెప్తారు,అవన్నీ ఇప్పుడు చెప్తున్నారో లేదో తెలియదు ఎందుకంటే ఇప్పుడంతా లవ్ పెళ్లిళ్ళే కాబట్టి దీనికి విరుద్ధంగా చెప్తున్నారో అత్తను కొట్టు, ఆడపడుచు నీ కాల్చుకు తిను, వేరు కాపురం పెట్టు, అత్త ను వెళ్లగొట్టు అని చెప్తున్నారు కాబోలు అందుకే కొందరు పెళ్లిళ్లు చేసుకున్నా ఇలాగే చేస్తూ, భర్తను పనివాడి గా చూస్తున్నారు. ఇందులో అబ్బాయి తప్పు కూడా చాలా ఉంది మొదటే పెళ్ళాన్ని కంట్రోల్ లో పెట్టుకోవడం చేతకాక నెత్తిన పెట్టుకుంటే ఆ నెత్తినే కొట్టి పోతున్నారు ఈ తరం అమ్మాయిలు. కాదంటారా..
నా ఈ వ్యాసం పై మీ అభిప్రాయాలు ఖచ్చితంగా తెలుపగలరు..
భవ్యచారు