ఈ ప్రపంచం ఒక చీకటి గుహ

ఈ ప్రపంచం ఒక చీకటి గుహ,,,,,,,!!

అంధకార బంధుర ఆకాశం కింద
ఈ ప్రపంచం ఒక చీకటి గుహ
నేను కృత్రిమ వెలుగులలో కూర్చున్న ఆశాజీవి మనిషిని,,,,,,,
నా జీవన ప్రయాణాన్ని ప్రమాణాన్ని నిర్దేశించిన సంక్లిష్ట కుబేర కృత్రిమత్వం,,,,,,,
నా కృత్రిమ జీవనానికి శ్వాస ఈ వృక్షం ప్రకృతి
కూలిపోయిన జీవనయాన ప్రపంచ గతులు
కొట్టుకుపోయిన యాంత్రిక జీవితాల కుళ్ళిన జీవన గతులు,,,,,,,,,
ఇప్పుడు ప్రపంచం ఒక కృత్రిమ రంగు పూల దర్శిని,,,,,,,,,
ఆకాశంలో వెలుగులీనుతున్నది కృత్రిమ పసుపు వర్ణం నెలవంక,,,,,
ఈ కృత్రిమ నెలవంక మాకు వెన్నెల కురిపించే రేడు,,,,,,,
ఈ అంధకారంలో ఎటువంటి అందాలు కుసుమించవు,,,,,,,,
అందాలన్నీ ఇనుప ముక్కల చట్రంలో గణించుకుని ఇముడ్చుకున్న కృత్రిమత్వం,,,,,,,,,
ఇక్కడ జీవించడం మన చేతుల్లో లేదు అంతా కృత్రిమ మేథస్సు నిర్ణేతలం,,,,,,,,,,
జీవం రాకడ పోకడ కృత్రిమ మేథస్సు నిర్దేశిస్తుంది,,,,,
ఈ కృత్రిమ జీవితాలకి దైవం ,మతం చిరునామా కోల్పోయాయి కృత్రిమత్వం ఏ ఐ నిర్దేశమే జీవనయాన పోకడలు,,,,,,,,,
కృత్రిమ కల్పనా జగత్తులో మానవుల స్వప్నాలన్నీ తేలిపోయే కాగితం పూవులు,,,,,,,,
మానవులను కారాగారంలో బంధించి ఉపయోగించుకున్నట్లు కృత్రిమ రంగుల ప్రపంచం,,,,,,,,,

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *