శీర్షిక
యువత డ్రగ్స్ జోలికి పోవద్దు
ఒక కాలేజీలో డిగ్రీ చదివే
పూజకు కొత్త స్నేహం ఏర్పడింది. అప్పటి వరకు చదువు పట్ల శ్రద్ధ చూపే
ఆమె సినిమాలు, షికార్ల
బాట పట్టింది. చెడు సావాసం అబ్బింది.
చదువు పట్ల శ్రద్ధ
తగ్గింది. మత్తు మందులు
కూడా ఆమెకు అలవాటు
అయ్యాయి. తల్లి తండ్రుల
గారాబం ఆమెను మరింత
పాడు చేసింది. డ్రగ్స్ ఆమె
పాలిటి శాపంగా మారాయి.
ఆమె బలహీనత ఆసరా
చేసుకుని తోటి విద్యార్థులు
ఆమెను మరింత డ్రగ్స్ కు
బానిసగా చేసారు. విషయం
తల్లిదండ్రులకు తెలిసే నాటికి
ఆమె ఆరోగ్యం క్షీణించడంతో,
ఆమెను ఒక హాస్పిటల్లో చేర్చారు. డ్రగ్స్ అలవాటు
మాన్పించి ఆమెను మళ్ళీ
మామూలు స్ధాయికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నా ఆమె చనిపోయింది. ఎంత దారుణం. పూజ
బంగారు జీవితం
బుగ్గి పాలు అయ్యింది.
మత్తు మందులు పిల్లల్ని
నిర్వీర్యం చేస్తున్నాయి.
ఇప్పుడు నగరంలో చాలా
ప్రాంతాల్లో ఈ డ్రగ్స్
మహమ్మారి పిల్లలను
కబళిస్తోంది. ఎవరి
పిల్లలను వారు కట్టడి
చేసుకోవాలి. వారి
బంగారు జీవితాన్ని
కాపాడుకోవాలి.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని