శీర్షిక
భార్యాభర్తల అనుబంధం
భార్యాభర్తల అనుబంధం
ఎన్నో జన్మల సంబంధం.
కష్టసుఖాలు పంచుకుంటూ,
ప్రేమను పెంచుకుంటారు.
బాధలలో ఒకరినొకరు
ఓదార్చుకుంటూ ఉంటారు.
కానీ నేటి సమాజంలో
మార్పులు వచ్చేసాయి.
సర్దుకు పోయే పరిస్థితులు
లేకుండానే పోతున్నాయి.
అర్ధం చేసుకునే ఓపిక
లేకుండానే పోతోంది.
ఆనందంగా లేని
సందర్భాలూ ఉన్నాయి.
ప్రేమలేమో తగ్గాయి.
పెద్దవారి సలహాలు
తీసుకోవటం లేదు.
కలిసి ఉంటే కలదు సుఖం.
ఆ విషయాన్ని గ్రహించాలి.
ఈ రచన నా స్వీయ రచన
వెంకట భాను ప్రసాద్ చలసాని