ఈ రోజు అంశంబస్సు ప్రమాదంలో మీరుంటే

శీర్షిక
అప్రమత్తంగా ఉండాలి.

నా చిన్నప్పుడు ఒకసారి నేనున్న బస్సు ప్రమాదానికి
గురైంది. పల్లెకు వెళ్ళే బస్సు
కాబట్టి బస్సు పరిస్థితి
అంత బాగా లేదు. పాత
బస్సులు పల్లెల్లో తిప్పటం
జరిగేది. అసలే డొక్కు బస్సు,
పైగా రోడ్డు అధ్వాన్నంగా
ఉండేది. ఎదురుగుండా
ఎడ్లబండి వచ్చేటప్పటికి
బస్సు డ్రైవర్ రోడ్డుకు ఎడమ
వైపుకు పోనిచ్చాడు. బస్సు
రోడ్డు దిగి పక్కనే ఉన్న కాలువలోకి వెళ్ళింది.
అదృష్టవశాత్తూ కాలువలో
నీరు లేదు కాబట్టి పెద్ద
ప్రమాదం జరగలేదు.
అందరికీ చిన్న చిన్న
గాయాలు అయినా
మొత్తానికి పెద్ద ప్రమాదం
ఏమీ జరగలేదు. తర్వాత
ట్రాక్టరుకు కట్టి బస్సును
బయటకు లాగారట.
రోడ్లు బాగున్నా, బాగా
లేకపోయినా ప్రమాదాలు
జరుగుతూనే ఉన్నాయి.
రోడ్డు బాగుంటే స్పీడుగా
వెళ్ళేందుకు ప్రయత్నం
చేస్తారు. మొత్తానికి అదే
నా మొదటి సినిమా అనుభవం. తర్వాత
ఎన్నో ఘటనలు జరిగినా
మొదట జరిగిన ఆ
సంఘటన గుర్తు
ఉండిపోయింది.

ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *