శీర్షిక
అందరు పిల్లల్ని చదువించాలి
మనమంతా సమాజంలో
భాగమే. సమాజంలో కొన్ని
అకృత్యాలు జరుగుతున్న
మాట నిజమే కానీ అవి
జరగడానికి సమాజంలో
ఉన్న వారందరూ బాధ్యులు
కారు. కొంత మంది తమ
స్వార్ధం కోసం ఆ అకృత్యాలు
చేస్తున్నారు. అందులో
బాల కార్మిక వ్యవస్థ ఒకటి.
బాగా చదువుకోవాల్సిన వయసులో పిల్లలతో పని
చేయించటం సరి కాదు.
చిన్న పిల్లలు కుటుంబ
ఆర్ధిక సమస్యల వల్ల
చదువు మానేసి వేరే
ఇళ్ళలో, హోటళ్ళలో,
పరిశ్రమల్లో పనిచేస్తూ
ఉన్నారు. ఈ విషయం
పట్ల ప్రభుత్వం సరైన
శ్రద్ధ పెట్టి బాలలంతా
చక్కగా చదువుకునే
విధంగా పరిస్ధితులు
కల్పించాలి. ప్రభుత్వ
పాఠశాలలను అభివృద్ధి చేసి, పిల్లల్ని చక్కగా
తీర్చిదిద్దే ప్రయత్నం చెయ్యాలి. అలాగే
వాలంటరీ సంస్ధలు
పిల్లల చదువు పట్ల
ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.
చిన్న పిల్లలకు చదువుతో
పాటు ఆటపాటలు కూడా
నేర్పించాలి. చిన్న పిల్లల బాల్యాన్ని చిదిమేసి వారితో
పని చేయించుకునే హక్కు
ఎవరికీ లేదు. చదువుకునే
హక్కు పిల్లలకు ఉంది. ఆ
విషయం సమాజం కూడా
గుర్తించాలి. కొన్ని సార్లు
ప్రత్యేక పరిస్థితులలో
పిల్లలు పని చెయ్యాల్సిన
అవసరం వస్తుంది. అప్పుడు
ఆ కుటుంబ ఆర్థిక వ్యవస్థ
మెరుగుపరిచేందుకు మన
ప్రభుత్వం గట్టి కృషి చెయ్యాలి. చదువుకున్న
యువత సానుకూల దృక్పథంతో ఆలోచన
చేస్తారు. అది దేశాన్ని
అభివృద్ధి పధంలోకి
తీసుకుని వెళుతుంది.
రాజకీయ రంగంలో
కూడా యువత కాలు
పెట్టాల్సిన అవసరం
ఉంది. అప్పుడే దేశం
బాగుపడుతుంది.
ఈ రచన నా స్వీయ రచన.
వెంకట భాను ప్రసాద్ చలసాని