ఈ సుందర జలపాతం సృష్టికి ప్రతిసృష్టి

ఈ సుందర జలపాతం సృష్టికి ప్రతిసృష్టి,,,,,!!

పెద్దపెద్ద కొండలపై నుంచి లోయల్లోకి ఉవ్వెత్తున రువ్వడిగా దూకే జలపాతం హొరులో మనల్ని మనం మైమరచిపోతాం. జలపాతం రెండు వైపులా తీగలు లతలు లతలుగా అల్లుకున్న ఆకులు, రెమ్మలు ,పూవులు మనస్సు రంజిళ్ళు దృశ్యం, ఉల్లాసం ఉరకలేస్తూ శోభిళ్ళు ఆనందడోలికల్లో మరులుగొన్న మనస్సు ఆ ప్రకృతి దిద్దిన సౌందర్యంలో తేలిపోతూ, ఆ తెల్లని పాలలాంటి నురగల్లో చిన్నపిల్లల మల్లే కేరింతలు కొడుతూ జలకాలాడుతుంటే ఈ నదీమతల్లిని అపవిత్రం చేస్తున్నామా అని నాకు అనిపించింది. ఆ సుందర జలపాతం వీక్షనలకందని ప్రకృతి సృజన, భగవత్ సృష్టి స్వరూపమా అని ప్రతిఒక్కరికీ అనిపించే జీవన్ముక్తి ప్రదాత, అద్భుత జీవన తంత్రులు హృదయాలకు. అలవోకగా ఆ ప్రాంతంలో ఎగురుతున్న రంగు రంగుల పక్షుల రాగాలలో హృదయం ఊయలలూగు సంజీవణులు.ఆ దృశ్యాలు అద్భుత కల్పవళ్ళులు, కళ్ళల్లోంచి హృదయాంతర్గభంలో చిత్రీకరించుకున్న కళాఖండం. ఆ చోటు వీడలేని వెలుగు వసంతాలు.

అపరాజిత్
సూర్యాపేట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *